భూకంపం భయానకంగా ఉంది.. క్షేమంగానే ఉన్నా: సెలీనా గోమెజ్
లండన్: హాలీవుడ్ సింగర్, స్టార్ హీరోయిన్ సెలెనా గోమెజ్ బల్గేరియాలో భూకంపంలో చిక్కుకున్నప్పటికీ.. తనకి ఎటువంటి అపాయం జరగలేదని , తాను క్షేమంగానే ఉన్నానని అభిమానులకు తెలిపింది. బల్గేరియాలో మంగళవారం రెక్టర్ స్కేలుపై 5.8 పరిమాణం భూకంపం సంభవించగా... ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సెలీనా గోమెజ్ తాను నటిస్తున్న సినిమా 'ద గెట్ అవే' షూటింగ్లో భాగంగా బల్గేరియాకు వెళ్లడంతో అభిమానులు భయపడ్డారు.
దీంతో తనకు ఎటువంటి అపాయం జరగలేదని సెలీనా గోమెజ్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. తన ట్విట్టర్ ఎకౌంట్లో సెలీనా గోమెజ్ 'మీ ఆందోళనలకు ధన్యవాదాలు!! భూకంపం భయానకంగా ఉంది కానీ అదృష్టవశాత్తూ అందరూ మంచిగా ఉన్నారని ట్వీట్ చేసింది.
టీనేజ్ పాప్ సింగర్ జస్టిన్ బైబర్‌కు తన స్నేహితులురాలు సెలెనా గోమెజ్‌తో నిశ్చితార్థం అయిందంటూ వస్తున్న వార్తలను బైబర్ అధికార ప్రతినిధి కొట్టి పారేశారు. ఈ విషయాలన్నింటిపై బైబర్ అధికార ప్రతినిధి స్కూటర్ బ్రౌన్ మాట్లాడుతూ ఇంటర్నెట్లో వస్తున్న ఈ పుకార్లు పూర్తిగా అబద్దం. ఈ రూమర్స్ పై బైబర్ టీమ్ మేట్స్ అంతా నవ్వుతున్నారని అన్నారు. ఇది ఇలా ఉంటే జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ 2010 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











