twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఎవరితోనూ డేటింగ్ చెయ్యడం లేదంటే నమ్మరే

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ పాప్ స్టార్ రిహానా ఇటీవల హీరో ఆస్టన్ కుచర్‌తో డేటింగ్ చేస్తుందంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ సందర్బంలో రిహానా మాట్లాడుతూ ఆస్టన్ కుచర్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చెయ్యడం లేదు. నేను సింగిల్‌గా ఉన్నప్పటికీ సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశా రు.

    24 సంవత్సరాల వయసు కలిగిన సింగర్ రిహానా గత వారం అర్దరాత్రి హీరో ఆస్టన్ కుచర్ ఇంటికి వెళ్లడం వల్లనే వీరిద్దరి మద్య రోమాన్స్ జరుగుతుందని అందరూ భావించినప్పటికీ... అవన్నీ కట్టుకథలుగా రిహానా కొట్టిపారేశారు. ఇటీవల కాలంలో పాప్ సింగర్ రిహానాకు సంబంధించినటువంటి కొన్ని నగ్న చిత్రాలు నెట్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.

    ఈవిషయంపై సింగర్ రిహానా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో వివరణ ఇవ్వడం జరిగింది. అసలు ఈనీలి చిత్రాలు నెట్ లో దర్శనమివ్వడానికి కారణం తన పాత బాయ్ ప్రెండ్ మరియు పుట్ బాల్ ప్లేయర్ క్రిస్ బ్రౌన్ తో రిహానా తెగతెంపులు చేసుకోవడం వల్ల రిహానా నగ్న చిత్రాలను నెట్‌లో పెట్టారని అన్నారు. ఐతే ఈనీలి చిత్రాలపై రిహానా తన అభిమానులకు క్లియర్‌గా తన వివరణను తెలిపారు. ఆ నగ్న చిత్రాలు 2010వ సంవత్సరంలో ఓ ఫోటో బుక్ ప్రచారకర్తగా ఉన్నప్పుడు తీసినవి అని అన్నారు. వీటిని 2010 కాఫీ టేబుల్ బుక్ రెటెడ్ ఆర్ లో ప్రచురించడం జరిగిందన్నారు.

    English summary
    Pop star Rihanna is furious about her rumored romantic link up with actor Ashton Kutcher and insists she is “single and happy”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X