జాకీ చాన్...చనిపోయాడంటూ వార్తలు
హైదరాబాద్: ఈ ప్రపంచంలో జాకీ చాన్ గురించి తెలియని సినిమా ప్రియులు ఉండరేమో. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా జాకీ చాన్ గురించిన ఓ వార్త అభిమానులను షాక్ కు గురి చేసింది. జాకీ చాన్ మరణించారంటూ ఆ వార్తల సారాంశం.
అభిమానులు మాత్రమే కాదు....జాకీ చాన్ కూడా ఈ వార్తలు విని షాక్ అయ్యారు. ఈ విషయమై తన ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందించారు. ‘ఇటీవల రెండు న్యూస్ రిపోర్టులు విని షాకయ్యాను. అందరికీ నేను చెబుతున్నది ఒకటే. ఎవరూ బాధ పడొద్దు. నేను బ్రతికే ఉన్నాను. నా పేరుతో వెబో అకౌంట్ సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మొద్దు అంటూ జాకీ చాన్ సూచించారు. గతంలోనూ జాకీ చాన్ మీద ఇలాంటి పుకార్లు వ్యాపించాయి.

జాకీ చాన్ సినిమాల విషయానికొస్తే...
త్వరలో 'కుంగ్ ఫూ యోగా' చిత్రంలో నటించనున్నారు జాకీచాన్. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఇండియాకు రాబోతున్నట్లు జాకీచాన్ తెలిపారు. 'కుంగ్ ఫూ యోగా' చిత్రం తొలి ఇండియా-చైనా కో ప్రొడక్షన్ చిత్రం అవుతుంది. గత సెప్టెంబర్ లో ఈ చిత్రం సైన్ చేసారు. గతంలో జాకీచాన్..బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తో కలిసి ది మిత్ చిత్రం చేసారు. అలాగే ఆయన 2013లో చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంచింగ్ కోసం న్యూడిల్లీ వచ్చారు.
అలాగే బాలీవుడ్ సినిమాలో నటించాలని ఉందన్న తన మనసులోని కోరికను జాకీచాన్ బయటపెట్టారు. ''నాకు హాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడాల్లేవు. స్క్రిప్టు నచ్చడం ముఖ్యం'' అన్నారు జాకీ.


Click it and Unblock the Notifications











