ట్విట్టర్‌లో అరుదైన రికార్డు.. అభిమానులకు కృతజ్ఞతలు
లండన్, జూన్ 1: ప్రపంచంలో తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో 25 మిలియన్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న అరుదైన రికార్డుని హాలీవుడ్ పాప్ సింగర్ లేడి గాగా సాధించారు. వెంటనే అభిమానులకు తన కృతజ్ఞతలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 26 సంవత్సరాల వయసు కలిగిన లేడిగాగా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో "# 25milliontweetymonsters వావ్! ఈరోజు నేను అధికారకంగా ప్రపంచంలో లక్కీయస్ట్ అమ్మాయిని అయినంత ఫీలింగ్ కలుగుతుందని" ట్వీట్ చేసింది.
లేడిగాగా తర్వాత ఈ మైక్రో బ్లాగింగ్ రేసులో మరో సింగర్ జస్టిన్ బైబర్ 22.5 మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉన్నాడు. ట్విట్టర్‌లో టాప్ టెన్ ఫాలోవర్స్ లేడిగాగా మొదటి స్దానంలో ఉండగా.. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, సోసియోలైట్ కిమ్ కర్దాషియాన్, అమెరికన్ టాక్ షో క్వీన్ ఓప్రా విన్ఫ్రే ట్విట్టర్‌లో ఆ తరువాత స్దానాలలో ఉన్నారు. ఇది మాత్రమే కాదు ట్విట్టర్‌లో మొట్ట మొదటి సారి 10, 15, 20 మిలియన్ల ఫాలోవర్స్ మైల్ స్టోన్‌లను అందుకున్న వ్యక్తి లేడిగాగా కావడం విశేషం.
లేడిగాగా అసలు పేరు స్టెఫని జెర్మనోట్టా. గాగా తన అభిమానులను ముద్దుగా లిటిల్ మోనిస్టర్స్‌గా అభివర్ణిస్తే తనని తాను మదర్ మోనిస్టర్‌గా పిలుచుకుంటుంది. ఇండోనేషియాలో లేడిగాగా సంగీత కచేరి చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇస్లామిస్ట్ కార్యకర్తలు ఆమె సెక్సీ బట్టలు ధరించి రెచ్చగొట్టే డ్యాన్స్ వేసి దేశ యువత పాడుచేస్తుందని పేర్కొంటూ, హింసాకాండ బెదిరించారు. దాంతో ఆమె ఇండోనేషియాలో సంగీత కచేరీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
లేడిగాగాని అభిమానులను ఎంతగా ఆరాధిస్తారో గాగా కూడా అభిమానులను అదే విధంగా చూస్తుంది. అభిమానుల కోసం తాను సంపాదించిన సంపాదనలో కొంత మొత్తం స్వచ్చంధ సంస్దలకు విరాళాలుగా ఇస్తుంది. మ్యూజిక్ లెజెండ్ 'టోనీ బెన్నెట్' లేడిగాగాకి చెందిన నగ్న చిత్రాన్ని ఈబే ద్వారా అమ్మకానికి ఈ పెయింటింగ్‌ని పెట్టారు. ఈ ఆర్ట్ పెయింటింగ్ ద్వారా వచ్చిన సోమ్ముని లేడిగాగా యూత్ సపోర్ట్ ఛారిటీ 'బార్న్ దిస్ వే ఫౌండేషన్'కి అందించారు.


Click it and Unblock the Notifications











