అతని ఫ్యాషన్ అంటే చచ్చేంత ఇష్టం: ప్రముఖ సింగర్
డేవిడ్ బెకహాం ప్రపంచ పుట్‌బాల్ చరిత్రలో ఈయన పేరు తెలియని ఉండరంటే నమ్మండి. పుట్‌బాల్ ఆటకు ప్యాషన్ ప్రపంచానికి ఈయనను ఓ ఐకాన్‌గా అభిమానులు కొలుస్తారు. ఇప్పడు కొత్తగా డేవిడ్ బెకహాం అభిమానుల జాబితాలోకి మరోకరు చేరిపోయారు. ఎవరా అని అనుకుంటున్నారా.. హాలీవుడ్ ప్రముఖ సింగర్, చిన్నతనంలో తన పాటల ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న పాప్ స్టార్, గ్రామీ అవార్డ్ విన్నర్ 'జస్టిన్ బైబర్'.
17సంవత్సరాలు వయసు కలిగిన జస్టిన్ బైబర్ ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ నేను అచ్చం బెకహాం మాదిరి ఉండడానికి ఇష్టపడుతానని అన్నారు. బెకహాం ఆడేటటువంటి సాకర్ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. అతని హెయిర్ స్టయిల్ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే బెకహాం ఎప్పుడూ కూడా తన హయిర్ స్టయిల్‌ని ఒకేలా మెయింటేన్ చేయరు. ఎప్పుడూ కూడా కొత్త హెయిర్ స్టయిల్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటారని అన్నారు.
ఇటీవలే డేవిడ్ బెకహాం భార్య విక్టోరియా బెకహాం ఓ పాపాయికి జన్మనివ్వడం జరిగింది. అంతక ముందు విక్టోరియా, డేవిడ్ బెకహాం జంటకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. ముగ్గురి తర్వాత పుట్టిన పుట్టిన ఆ అమ్మాయికి డేవిడ్ బెకహాం జంట 'హార్పర్ సెవెన్' అనే పేరుని పెట్టడం జరిగింది.
విక్టోరియా బెకహాం ఈ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇద్దరి ఫోటోలను క్షేమంగా ఉన్నారని అభిమానులకు తెలిపేందుకు గాను డేవిడ్ బెకహాం సామాజిక వెబ్ సైట్ అయిన ఫేస్‌బుక్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయిన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. కేవలం హార్పర్ సెవెన్ పుట్టి 12 వారాలు కాక మందు తన కుటుంబంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని డేవిడ్ బెకహాం అన్నారు.
హార్పర్ సెవెన్ కోసం ప్రత్యేకంగా తన ప్యాలెస్ మొత్తానికి 'పింక్ కలర్' వేయించినట్లు డేవిడ్ బెకహాం తెలిపారు. తన ముగ్గురు కుమారులు(బ్రూక్లెన్(12), రోమియో(9), క్రూజ్(6))లు కూడా వారికి చెల్లెలు పుట్టడంతో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు. ప్రస్తుతం పింక్ ప్యాలెస్‌లో ఉంటున్న హార్పర్ కొసం డేవిడ్ బెకహాం దంపతులు హార్పర్ ధరించేటటువంటి దుస్తులు, బూట్లు, సాక్సులు అన్నింటిని కొన్ని గదులకు దాచి ఉంచినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











