నా వరకు భారీ అందాలంటేనే ఇష్టం: కెల్లీ బ్రూక్

By Nageswara Rao

లండన్, జూన్ 20: హాలీవుడ్ మోడల్, హీరోయిన్ కెల్లీ బ్రూక్ ఎప్పుడూ భారీతనాన్నే ఇష్టపడతానని.. సోఫా మీద కూర్చోని కేక్ తినడం మరింతగా ప్రేమిస్తానని చెప్పింది. నా శరీరం అంటే నాకు చాలా ఇష్టం. నా శరీరం షేపులను కలిగి ఉండడమే నాకు చాలా ఇష్టం. చాలా మంది ఆడ పిల్లలు ఇలా ఉండడాన్నే కోరుకుంటారనేది నా అభిప్రాయం. మీకు అందమైన బాయ్ ప్రెండ్ ఉన్నప్పుడు అతనితో కలిసి సోఫా మీద కేక్ తినడం అధ్బుతంగా ఉంటుందని తెలిపింది.

నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ మోడ్రన్ ప్రపంచంలో నాకు కావాల్సినవన్నీ నేను తినగలను. అంతేకాదండోయ్ ప్రతి రోజు వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను తెలివైన, ఆరోగ్యకరంగా ఉండడం వల్ల ఎప్పుడూ ఎక్కువ సేపు కూర్చోనని చెప్పింది. 32 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ తన శరీరంలో కొన్న భాగాలను మాత్రం మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అల్టిమేట్‌గా తన శరీరం తీరుపై సంతోషంగా ఉన్నానని అంది.

ప్రస్తుతం నేను నా పొట్ట భాగంలో కాస్త మార్పులు చేద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ.. అలా కాలేదు. నేన 20 యేళ్ల వయసులో ఉన్నప్పడు ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు అదే విధంగా ఉన్నానని అన్నారు. నేను మాత్రం నా లైఫ్ స్టయిల్‌లో మార్పు వచ్చిందంటే ఒప్పుకోను... కేవలం నేను వయసులో పెద్దదాన్ని మాత్రమే అవుతున్నానని అన్నారు.

'కీత్ లెమన్' సినిమాలో నటించినందుకు గాను కెల్లీ బ్రూక్ 65వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్‌కు రావడం జరిగింది. ఓ కార్యక్రమంలో కెల్లీ బ్రూక్ మాట్లాడతుండగా.. ఓ ప్రెంచ్ బిజినెస్ మ్యాన్ కెల్లీ వద్దకు వెళ్లి తనతో ఒకరాత్రి గడపాల్సిందిగా కోరాడు. అందుకు గాను $1మిలియన్‌ని ఆశగా చూపిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X