twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెలబ్రిటీనైనా నా లాండ్రీ నేనే చేసుకుంటా..: క్యారీ అండర్వుడ్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ 'క్యారీ అండర్వుడ్' ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తాను ఒక నటిని అయినప్పటికీ.. తానే స్యయంగా లాండ్రీని చేసుకోవడానికి ఇష్టపడతానని చెప్పారు. ఇది మాత్రమే కాదు రోడ్డు మీద కిరాణా షాపులకు వెళ్లి కూరగాయలు మొదలగునవి లాంటి షాపింగ్ తానే చేస్తానని అన్నారు.

    నా లాండ్రీని ఇతరులు చేయడానికి తనకి ఏమాత్రం ఇష్టం ఉండదని అన్నారు. అలాంటి వారి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని 29 సంవత్సరాల వయసు కలిగిన 'క్యారీ అండర్వుడ్' తెలిపారు. నేను ఖాళీగా ఉన్న సమయంలో లాండ్రీ చేసే చోటు వెళ్లి ఎంజాయ్ చేస్తూ నా లాండ్రీ పనిని చేస్తానని తెలిపింది. ఒకవేళ నేను పర్యటనలో ఉంటే గనుక లాండ్రీకి సంబంధించిన విషయాలను మరచిపోతానని చెప్పింది. ఎందుకంటే పర్యటనలలో ఉంటే లాండ్రీకి సరైన సమయం కేటాయించలేమని పేర్కోంది.

    ఇక క్యారీ అండర్వుడ్ గురించి తెలుసుకుంటే 2005వ సంవత్సరానికి గాను అమెరికన్ సింగింగ్ టాలెంట్ షో 'అమెరికన్ ఐడల్' విన్నర్ టైటిల్ ని సొంతం చేసుకుంది. గ్రామీ అవార్డులు, బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, అమెరికన్ మ్యూజిక్ అవార్డులను సొంతం చేసుకోవడం వల్ల మల్టీ ప్లాటినమ్ సెల్లింగ్ రికార్డింగ్ ఆర్టిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. 2009వ సంవత్సరంలో 'ఓక్లహోమా మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేమ్' స్దానం సంపాదించుకుంది.

    English summary
    Actress Carrie Underwood may be a star, but says she likes doing her own laundry and doesn’t mind indulging in grocery shopping on the road.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X