twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ చరిత్రలోనే ఈయన తీసిన సినిమాలు కొత్తవారికి ఓ ప్రామాణికాలు..!

    By Nageswara Rao
    |

    మెల్ గిబ్సన్ ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారుండరు అంటే నమ్మండి. హింసతోనే మొదలవుతాయి ఈయన తీసిన అన్ని సినిమాలు. ఫాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మరియు అపోకాలిప్టో లాంటి సినిమాలు తీసిన తీరు అధ్బుతం. హాలీవుడ్ చరిత్రలోనే ఈయన తీసిన సినిమాలు కొత్తవారికి ఓ ప్రామాణికాలు. ఈయన తీసిన సినిమాలలో రక్తం ఏరులై పారాల్సిందే. హాలీవుడ్ కి ఎన్నో మైలుస్టోన్ లాంటి సినిమాలు అందించారు. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గవి మాడ్ మాక్స్ సిరిస్, గాలిపోలి, దిఇయర్ ఆఫ్ లివింగ్ డేంజరస్లీ, ది బౌంటి, హామ్లెట్, బ్రేవ్ హాట్, ఫాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మరియు అపోకాలిప్టో ఇలా చాలా ఆణి ముత్యాలు లాంటి సినిమాలు తీశారు. తను తీసే సినిమాలలో రియాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మనిషి మెల్ గిబ్సన్.

    ఇటీవల కాలంలో మెల్ గిబ్సన్ గురించి తన మాజి లవర్ ఒకాసనా గ్రిగరోవా మరియు మాడ్ మాక్స్ సిరిస్ లోని హీరోయిన్ మెల్ గిబ్సన్ గురించి మనకు తెలియని కొన్నినిజాలను మనతో పంచుకున్నారు. మాడ్ మాక్స్ సిరిస్ సినిమాలో హీరోయిన్ గా నటించే సమయంలో ఓ సన్నివేశంలో సీను పండేంత వరకు ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ సన్నివేశంలో నేను బాగా ఏడవాలి కాని నాకు ఏడుపు రాకపోవడంతో తన పిడికిలితో నా మూతిమీద గట్టిగా గుద్దారు. పక్కనే నాకూతరు కూడా ఉండడంతో అది చూసిన నాకూతురు కళ్శవెంట దారాళంగా నీళ్శు రావడం అది చూసిన నేను చాలా భయపడిపోయాను. దానితో పాటు ఇంకా బాగా చెయ్యాలి అంటూ నా ముఖం మీద మరియు మూతి మీద చాలా బలంగా కోట్టారు. దాంతో నేను క్రిందపడిపోయాను. చివరకు ఎలాగో అలాగ అసన్నివేశం పూర్తి చేశాం. ఆ టైమ్ లో ఐతే ఆయన నన్ను చంపేస్తారేమో అని అనుకున్నాను.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X