బాండ్ గర్ల్‌కి నేను సూట్ అవనేమో: హారిస్

By Nageswara Rao

జేమ్స్ బాండ్ సినిమాలలో హీరో ఎంత కీలకలమో హీరోయిన్ కూడా అంతే కీలకం. జేమ్స్ బాండ్ చేసే సాహాస విన్యాసాలలో జేమ్స్ బాండ్ గర్ల్‌గా తనవంతు సహాయం చేస్తుంది. 23వ జేమ్స్ బాండ్‌గా డేనియల్ గ్రెగ్ నటిస్తున్న స్కైఫాల్ సినిమాలో గ్రెగ్ సరసన ఫీల్డ్ ఏజెంట్‌గా 'నోమీ హారిస్' నటిస్తుంది. ఈ సందర్బంలో నోమీ హారిస్ మాట్లాడుతూ మొదటగా ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్ పాత్రకు నేను తగనని అందరూ భావించడం జరిగింది.

35 సంవత్సరాల వయసు కలిగిన నోమీ హారిస్ అభిమానులకు నిజం చెప్పాలంటే జేమ్స్ బాండ్ గర్ల లాంటి పాత్రలకు నేను ఖచ్చితంగా సరిపోతానని అనుకోలేదన్నారు. ఐతే ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్‌గా నటించడం మాత్రం నాకు ఓ కొత్త అనుభూతనిచ్చిందన్నారు.

2012వ సంవత్సరంలో వచ్చే సినిమాలలో మహిళలు ధీటుగా నటించే పాత్రలు రానున్నాయని జోస్యం చెప్పారు. జేమ్స్ బాండ్ సినిమాలలో నటించిన బాండ్ గర్ల్‌గా నటించిన హీరోయిన్స్‌కి అరవై, డెబ్బై సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ సరైన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X