twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె నా దుస్తులను ధరిస్తే చూడాలని ఉంది

    By Nageswara Rao
    |

    లండన్: బ్రిటిష్ సింగర్ నుండి డిజైనర్‌గా మారిన 'మైలీన్ క్లాస్' హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ తాను రూపొందించిన డ్రస్సులను ఒక్కసారైన ధరించాలని ఆరాటపడుతుంది. 34 సంవత్సరాల వయసు కలిగిన మైలీన్ క్లాస్ ఇటీవలే మొట్టమొదటి ఫ్యాషన్ కలెక్షన్‌ని ప్రారంభించింది. ఈ సందర్బంలో మైలీన్ క్లాస్ మాట్లాడుతూ నేను రూపొందించిన బ్లాక్ మ్యాక్సీ డ్రస్సుని ఏంజిలీనా జోలీ ఒక్కసారి ధరిస్తే చూడాలని ఉందన్నారు.

    స్వతంత్రంగా జీవించే వారంటే నాకు చాలా ఇష్టం. వారిలో ఉండే విశ్వాసాన్ని ఎంతగానో అభిమానిస్తాను. నికోల్ రిచీ, సింగర్ రిహానా ఎల్లప్పుడూ చూసేందుకు బ్రహ్మాండంగా కనిపిస్తారు. ఏంజిలీనా జోలీ కూడా నేను రూపొందించిన బ్లాక్ మ్యాక్సీ ధరిస్తే చూసేందుకు అందంగా ఉంటుందని అన్నారు. ఇక ఏంజిలీనా జోలీ విషయానికి వస్తే త్వరలో బ్రాడ్ పిట్‌ని వివాహాం చేసుకోనున్నారు. వీరి పెళ్లి అనంతరం అధికారిక పార్టీని పిట్, జోలీల పిల్లలు, ఫ్యామిలీ సమక్షంలో జరుపుకోనున్నారు.

    ప్రస్తుతం వీరిద్దరూ వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. బ్రాడ్ పిట్ 'ది కౌన్సిలర్' అనే సినిమాలో నటిస్తుండగా.. ఏంజిలీనా జోలీ 'మేల్ ఫీసియంట్' సినిమాలో నటిస్తున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన తారీఖుని ఇంకా నిర్ణయించ లేదు. గత ఏడు సంవత్సరాలుగా పిట్, జోలీ కలిసి సహాజీవనం సాగిస్తున్నప్పటికీ.. గత ఏప్రిల్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్ అయింది.

    బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.

    గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    British singer Myleene Klass, who recently turned designer, wants actress Angelina Jolie to wear her clothes from the collection.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X