నాకు కరోనా సోకింది నిజమే.. ఆరోగ్యంపై చెలరేగుతున్న రూమర్లపై మడోన్నా క్లారిటీ
అమెరికాలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో పాప్ దేవత మడోనా ఆరోగ్యంపై రూమర్లు స్వైర విహారం చేశాయి. కరోనా బారిన పడటంతో ఆమె ఆరోగ్యం విషమించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తన ఆరోగ్యం గురించి మడోనా ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు. ఇంతకు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే...

పారిస్ టూర్ సందర్భంగా వైరస్ సోకింది
ఇటీవల తాను మేడమ్ ఎక్స్ టూర్ చేపట్టిన సమయంలో కరోనావైరస్ బారిన పడ్డాను. పారిస్ పర్యటనలో నేను ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాను. అయితే పూర్తిగా క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకొన్నాను. దాంతో కరోనా మహమ్మారి కోరల నుంచి పూర్తిగా బయటపడ్డాను. ఇటీవల చేయించిన పరీక్షల్లో నా శరీరంలో యాండీ బాడీస్ ఉన్నాయనే విషయం స్పష్టమైంది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. నేను బాగానే ఉన్నాను అని మడోన్నా చెప్పారు.

నా శరీరంలో యాంటీ బాడీస్
కరోనాను ఎదురించే యాంటీ బాడీస్ తన శరీరంలో ఉన్నాయని గతవారం మడోన్నా వ్యాఖ్యలు చేయడం కొంత కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసింది. ఇక నేను స్వేచ్ఛగా బయట తిరగవచ్చు. కారు అద్దాలు దించుకొని ప్రయాణించవచ్చు. సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు అంటూ మడోన్నా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపింది. అయితే తాజాగా ఇచ్చిన క్లారిటీతో కరోనా బారిన పడినట్టు అర్ధమైంది.

మడోన్నాపై ప్రశంసలు
ఇక కరోనావైరస్‌పై జరుగుతున్న పోరాటానికి మడోన్నా మద్దతు పలికారు. వ్యాక్సిన్ తయారీ కోసం చేపట్టిన నిధుల సేకరణకు ఆమె మద్దతు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల నుంచి సుమారు 8 బిలియన్ డాలర్ల మేర నిధులను సేకరించ గలిచారు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధిని తరిమి కొట్టేందుకు చేపట్టిన చర్యలపై ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.
Recommended Video

రూమర్లు క్రియేట్ చేసేవారికి..
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీకి నిధులు అందించడంపై మడోన్నా స్పందిస్తూ.. ఇలాంటి పరిశోధనలో తాను భాగం కావడం గర్వంగా ఉంది. తన గురించి మీడియాలో సెన్సేషనల్ హెడ్డింగులు పెట్టేవారు కరోనా వైరస్ లక్షణాల గురించి కాస్త రీసెర్చ్ చేస్తే బాగుంటుందేమో అంటూ ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడటం లేదు అని క్లారిటీ ఇచ్చారు. అందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. రూమర్లు క్రియేట్ చేసేవారికి ఇదే నా మెసేజ్ అంటూ మడోన్నా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











