»   » తలకు తుపాకీ.. ఆ క్షణంలో రేప్‌కు కూడా సిద్ధపడ్డాను.. వణికిన హీరోయిన్

తలకు తుపాకీ.. ఆ క్షణంలో రేప్‌కు కూడా సిద్ధపడ్డాను.. వణికిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ క్షణంలో నన్ను రేప్ చేసి కాల్చిపడేస్తారని అనుకొన్నానని హాలీవుడ్ నటి, టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియాన్ ఓ భయనక అనుభవాన్ని గుర్తు చేసుకొన్నారు. ఆ సమయంలో తలకు తుపాకి గురిపెట్టడంతో మైండ్ బ్లాక్ అయిందని, దాదాపు నేను రేప్‌కు మానసికంగా సిద్ధపడి పోయానని ఆమె తెలిపారు. 2016 అక్టోబర్‌లో ప్యారిస్‌లోని ఓ హోటల్‌లో జరిగిన దాడి ఘటన ఇటీవల మీడియాకు వివరించారు.

తలకు తుపాకీ

తలకు తుపాకీ

హోటల్‌లోకి జోరబడిన సాయుధులు తుపాకీ గురిపెట్టారు. ఆ సమయంలో ఏమీ తోచక ఓ వైపు తుపాకీని, మరో వైపు కిందికి వెళ్లే మెట్లను చూస్తూనే నిలబడిపోయాను. అప్పుడు నా మెదడులో రెండు రకాల ఆలోచనలు ఉండటంతో ఓ నిర్ణయం తీసుకోలేకపోయాను. అక్కడి నుంచి పారిపోతే నా శరీరం వెనుక బుల్లెట్లు దిగడం ఖాయం అని అనుకొన్నాను.

లాగి బెడ్‌పైకి విసిరి

లాగి బెడ్‌పైకి విసిరి

ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి నా మూతికి టేప్ అంటించాడు. అరవొద్దని బెదిరించారు. తలకు తుపాకీ పెట్టి కాల్చినంత పనిచేశారు. నా రెండు కాళ్లను లాగి బెడ్ మీద పడేశాడు. ఆ తర్వాత అతని వైపు లాక్కొన్నాడు. అప్పుడు అనిపించింది వారు నన్ను రేప్ చేయబోతున్నారు. ఆ క్షణంలో రేప్‌కు నేను కూడా మానసికంగా సిద్ధపడిపోయాను. చేతులెత్తి నన్ను ఏమి చేయవద్దని వేడుకొన్నాను. దాంతో వారు నాపై లైంగిక దాడి చేయకుండా నగలు తీసుకొని వెళ్లిపోయారు.

దొంగలు అనుకోలేదు

దొంగలు అనుకోలేదు

హోటల్ లోకి వచ్చిన దోపిడి దొంగలను నా వ్యక్తిగత సిబ్బంది అనుకొన్నాను. వారు నైట్ క్లబ్‌కు వెళ్లి లేటుగా వచ్చి ఉంటారని భావించాను. అయితే వచ్చింది దొంగలు అని తెలుసుకొని వణికిపోయాను. ఆ పరిస్థితి ఇప్పుడు తలుచుకొన్న ఒళ్లు జలదరిస్తుంది అని కిమ్ పేర్కొన్నారు.

2016లో ఘటన

2016లో ఘటన

ఈ ఘటన 2016 అక్టోబర్‌లో ప్యారిస్‌లోని ఓ విలాసవంతమైన హోటల్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. ఆమె వద్ద నుంచి సుమారు 10 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన జ్యువెలరీని దోచుకెళ్లారు. ఆ భయనక అనుభవాన్ని అమెరికాలోని ఓ టెలివిజన్ కార్యక్రమంలో కిమ్ వివరించారు.

English summary
Kim Kardashian shared more sordid details from her Paris robbery. Kim revealed that she mentally prepared herself to be either raped or killed. “He grabs my legs and I wasn’t, you know, I had no clothes on under,” she said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu