నాలాగ నా పిల్లల కెరియర్ అవ్వకూడదనే ఈ నిర్ణయం
అమెరికా స్టార్ హీరోయిన్ జెస్సికా ఆల్బా తన పిల్లలను హాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎట్టి పరిస్దితులలోను ఇండస్ట్రీగా పరిచయం చేయించనని అంటున్నారు. అందుకు కారణం ఏంటని ప్రశ్నించగా జెస్సికా ఆల్బా సమాధానంగా నేను కూడా నాజీవితంలో 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలలో నన్ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'క్యాంప్ నవ్ ఇయర్' అనే సినిమాలో తెరకు పరిచయం చేశారు. ఆ వయసులో నేను సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం వల్ల నా జీవితంలో చిన్ననాటి మధుర జ్ఞాపకాలను కొల్పోయాను.
అందుకే ఇప్పుడు అలా నా పిల్లలకు జరగకూడదని అంటున్నానని అన్నారు. జెస్సికా ఆల్బా మాట్లాడుతూ నా పిల్లలను నాలాగే కావాలని మాత్రం నేను ఆశించడం లేదు. ప్రస్తుతం నాకు మూడు సంవత్సరాల వయసు కలిగిన పాప ఉంది. పాప పేరు మారియా. త్వరలో మరో పాపకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. తన జీవితం గురించి తనకు అప్పుడే ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకే నాపిల్లలను వారియొక్క కాలేజీ డేస్ పూర్తి అయ్యేవరకు సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడొద్దని అంటున్నారు. ఇక నా భర్త క్యాష్ వారెన్ కూడా ఇదే రంగంలో ప్రోడ్యూసర్‌గా వ్యవహారిస్తున్న సంగతి మీకు అందరికి తెలిసిందే.
జెస్సికా ఆల్బా ఈ విషయాలన్నీ ప్రస్తుతం నటించి విడుదలకు సిద్దమైన స్పై కిడ్స్ 4డి ప్రమోషన్‌లో భాగంగా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా హాలీవుడ్ కెరియర్ ప్యామిలీతో నడపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. ఒక వీకెండ్ చివరి వారంలో పూర్తిగా నేను మా భర్త ఇద్దరం కూడా రోజు మొత్తాన్ని మా పాప కోసం కేటాయించడం జరిగింది. ఆ రోజు మేము అసలు ఒక్క మెయిల్‌కి గానీ, టెక్ట్స్‌కి గానీ రిప్లై ఇవ్వలేదు. నిజంగా మా జీవింతలో ఆరోజు మరచిపోలేని రోజని అన్నారు.


Click it and Unblock the Notifications











