మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రంలో ఐష్..??
మహాత్మ గాంధీ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని నిర్మించిన సినిమాలో మహాత్మ గాంధీగా నటించి అందరినీ మెప్పించి, ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్న నటుడు కింగ్ స్లే. కాగా ఇటీవల ఆయన గోవాలో జరుగుతున్న 40వ అంతర్జాతీయ సినీవారోత్సవాలకి వచ్చినప్పుడు తన తాజా సినిమా విశేషాలను మనతో పంచుకున్నాడు. తన తాజా చిత్రం భారతదేశానికి వన్నె తెచ్చిన కట్టడం తాజ్ మహల్ మీద ఉంటుందని, షాజహాన్ ముంతాజ్ ల ప్రేమ కథను ప్రపంచానికి చాటి చెప్పాలనే తనీ సినిమాను తీయాలని అనుకుంటున్నానని తెలిపారు.
కాగా ఈ సినిమా లో షాజహాన్ గా నటించనున్న కింగ్ స్లే, ముంతాజ్ పాత్రకు మాజీ ప్రపంచ సుందరి, భారత నారి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను ఎన్నుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. 30 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటించడానికి ఐష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ కింగ్ స్లే మాత్రం ఐష్ సినిమా తీయాలని కలలు కంటున్నాడు. ఈ సినిమా షూంటింగ్ వచ్చే ఏడాది జులైలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











