»   » ‘ఐస్ ఏజ్-5’ ట్రైలర్ అదిరింది (వీడియో)

‘ఐస్ ఏజ్-5’ ట్రైలర్ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ యానిమేషన్ సినిమాలు ఇష్టపడే వారికి ‘ఐస్ ఏజ్' సిరీస్ సినిమాల గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదనుకుంటాం. ఇప్పటికే ఈ సిరీస్ లో నాలుగు సినిమాలు వచ్చి ఘన విజయం సాధించాయి. 2016లో మరొకటి రాబోతోంది. ‘ఐస్ ఏజ్ -కొలిసన్ కోర్స్' పేరుతో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

తాజాగా ట్రైలర్ విడుదల చేసారు. మంచు కురిసే ఐస్ ప్రపంచంలో కుటుంబ సభ్యులులాగా కలిసి, మెలిసి ఉండే జంతువుల మధ్య సాగే విచిత్రమైన కథతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఐస్ ఏజ్ 5'. ఏనుగు, సింహం, పులి, ఎలుగుబంటు, పిల్లి, కుక్క, ఎలుక.. ఇలా అన్ని రకాల జంతువులు పాత్రదారులుగా కనిపించే ఈ సినిమాను బ్లూ స్కై, 20 సెంచరీ ఫాక్స్ యానిమేషణ్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Ice Age Collision Course - Official Trailer

జులై 22, 2016న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది యానిమేషన్ సినిమా కేవలం పిల్లల సినిమా అనుకుంటే పొరపాటే. గతంలో విడుదలైన నాలుగు సిరీస్ లు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఎంతగానో అలరించాయి. ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు వసూలు చేసాయి. ఈ నేపథ్యంలో ‘ఐస్ ఏజ్-5' చిత్రానికి కూడా మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ ఈ సినిమాను ఇండియాలో విడుదల చేయనుంది.

English summary
ICE AGE: COLLISION COURSE, opening in theaters everywhere July 22, 2016, stars returning cast members Ray Romano, Denis Leary, John Leguizamo, Queen Latifah, Seann William Scott, Josh Peck, Simon Pegg, Keke Palmer, Wanda Sykes, and Jennifer Lopez. Joining the herd are Stephanie Beatriz, Adam DeVine, Jesse Tyler Ferguson, Max Greenfield, Jessie J, Nick Offerman, Melissa Rauch, Michael Strahan and Neil deGrasse Tyson.
Please Wait while comments are loading...