పాజిటివ్ అని తేలింది కానీ లక్షణాలు లేవు.. కరోనా రూమర్స్‌పై స్పందించిన హాలీవుడ్ నటుడు

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలమందికి పైగా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మరణాలు కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ వైరస్‌కు విరుగుడును కనిపెట్టకపోవడంతో మానవాళి మరింత ఆందోళనకు గురవుతుంది. ఈ వైరస్ సోకిందని నిర్దారణ చేయడానికి సమయం పట్టడం, అది కూడా పాజిటివ్ అని కన్ఫామ్ చేయడానికే ఒకటి రెండు రోజులు పట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హాలీవుడ్ నటుడికి కరోనా వల్ల వింత అనుభవం కలిగింది. అదేంటో ఓ సారి చూద్దాం.

పాజిటివ్ అని తేలింది..

పాజిటివ్ అని తేలింది..

హాలీవుడ్ ప్రముఖ నటుడు ఇడ్రిస్ ఎల్బాకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఈ రోజు ఉదయం నాకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. నాలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించక పోయినా పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో నేను ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నాను. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి' అని ఆదివారం ట్వీట్ చేశాడు.

భార్యతో కలిసి వీడియో..

తన భర్యా సబ్రినా దోవ్రీతో కలిసి ఉన్న వీడియోను కూడా ఇడ్రిస్ విడుదల చేశారు. ‘కరోనా వైరస్ ప్రబలుతుండటం చాలా తీవ్రంగా పరిగణించాలి. అందరూ జనసమూహాలకు దూరంగా ఉండటంతోపాటు చేతులు కడుక్కోవాలి. మీరు అనారోగ్యానికి గురైతే వెంటనే పరీక్ష చేయించుకోండి' అని ఇడ్రిస్ సూచించాడు.

లక్షణాలు మాత్రం లేవు..

లక్షణాలు మాత్రం లేవు..

కరోనా పాజిటివ్ అని తేలింది కానీ ఆ లక్షణాలు మాత్రం లేవని చెప్పుకొచ్చాడు ఇడ్రిస్. అసలు ఎంత కాలం నుంచి ఇలా ఉందని ఆయన్ను నెటిజన్స్ ప్రశ్నించగా.. ఆదివారం పాజిటివ్ అని వచ్చింది కానీ ఇంతవరకు కరోనా లక్షణాలు మాత్రం బయట పడలేదని, తాను క్షేమంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Anchor Suma Tips To Stay Away From Corona Virus
నెగెటివ్ కామెంట్స్

నెగెటివ్ కామెంట్స్


తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగెటివ్‌గా స్పందించారు. తన భార్యను తన నుంచి దూరంగా ఉండమని అందరూ సలహా ఇచ్చారు. కానీ ఆమె మాత్రం అలా చేయలేదని, తనతోనే ఉందని తెలిపాడు. ఆమెకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఆమెకు కూడా ఈ వైరస్ సోకలేదని, తాము సంతోషంగా ఉన్నామని అభిమానులతో చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X