twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏమి టైమింగ్ సెన్సు.. మిట్ట మధ్యాన్నం బికినీలో..

    By Nageswara Rao
    |

    సాధారణంగా చాలా మంది వారి షేప్స్‌ని, ఫిగర్‌ని బికినీ డ్రస్సులలో ప్రముఖ మ్యాగజైన్ ప్రంట్ పేజిలలో దర్శనమిస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా హాలీవు్డ స్టార్ హీరోయిన్ ఇమోజిన్ థామస్ ఎండలో మిట్టమధ్యాన్నం బికినీతో దర్శనమిచ్చి యువత గుండెల్లో గుబేలును పుట్టించింది. దీనికి సంబధించిన పూర్తి సమాచారం మీకోసం..

    ఇమోజిన్ థామస్ మాజీ బిగ్ బ్రదర్ షోలో స్టార్ హీరోయిన్. తన అందాలను ఇటీవల యోగా క్లాసులకు వెళుతూ స్పోర్ట్స్ బ్రా, టినీ షర్ట్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 28 సంవత్సరాలున్న ఈ అమ్మడు లండన్ నడివీధుల్లో పోల్కా చుక్కలున్న టాప్ బికినీ పై భాగాన ధరించగా,క్రింద భాగాన డెనిమ్ మిని స్కర్ట్‌ని ధరించి నడుస్తుంటే అందరూ కూడా ఒక్కసారి అవాక్కవడం జరిగింది.

    ఇలా నడవమే కాకుండా తన ట్విట్టర్ పేజిలో లండన్ చాలా హాట్ హాట్‌గా ఉందంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు మాత్రం మిట్టమద్యాన్నం అర్దనగ్నంగా ఎండలో నడిస్తే హాట్ హాట్‌గా ఉండక, కూల్‌గా ఉంటుందమ్మా అంటూ ఎదురు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇమోజిన్ థామస్ లండన్ రావడానికి కారణం లండన్ లోని 'షాప్ట్స్‌బరీ' ధియేటర్లో 'రాక్ ఆఫ్ ఏజెస్ గాలా' అనే కార్యక్రమానికి హాజరవ్వడానికి వచ్చారు.

    ఈ సందర్బంలో లండన్‌లో తాను తెలుసుకుంటున్న విషయాలన్నింటిని కూడా తన అభిమానులకు ట్విట్టర్ పేజి ద్వారా తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలో ఇమోజిన్ థామస్ చూసిన అభిమానులు అందరూ కూడా మీరు చాలా అందంగా, సన్నగా కనిపిస్తున్నారని అనగా, దీనికి సమాధానంగా ఇమోజిన్ థామస్ అమెరికాలో ఉన్నప్పుడు యోగా క్లాసులకు వెళ్ళడం జరిగేది. అలా యోగా చేయడం వల్లనే ఇంత అందంగా ఉన్నానేమోనని అన్నారు.

    English summary
    The 28-year-old star was spotted wearing a polka dot bikini top and tiny denim miniskirt as she strolled along the streets of London carrying her top.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X