ఆడ పిల్లకు తండ్రి కావాలంటున్న 'గే' సింగర్
ప్యూర్టో రికాన్ గాయకుడు, 'గే' గా అందరూ ముద్దుగా పిలుచుకునే రికీ మార్టిన్ 2012వ సంవత్సరానికి గాను కూతురు కావాలంటున్నట్లు సమాచారం. 40 సంవత్సరాలు వయసు కలిగిన రికీ మార్టిన్ ఆగస్టు 2008లో అద్దె తల్లి(ఇతరుల కొరకు తాను బిడ్డను కను స్త్రీ) ద్వారా మాటెయి, వాలెంటినో అనే పిల్లలకు తండ్రి అయిన విషయం తెలిసిందే. ఐతే ఈసారి మాత్రం తనకు మగ పిల్లలు వద్దంటూ, ఆడపిల్లే కావాలని మారాం చేస్తున్నాడు.
దీనితో పాటు రికీ మార్టిన్ తన బాయ్ ప్రెండ్ కార్లోస్ గోంజలెజ్‌ని జనవరి 28న న్యూయార్క్‌లో పెళ్లి చేసుకోనున్నారు. గతయేడాది జూన్‌లో ఏకలింగ సంబంధం పెళ్లిళ్లు చేసుకోవచ్చని న్యూయార్క్ గవర్నమెంట్ విధివిధానాలను రూపొందించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మద్య హోమో సెక్సువల్ రిలేషన్ ఉందని మార్చి 2010లో ప్రతికా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 24వ తేదీనాటికి రికీ మార్టిన్‌కి 40 సంవత్సరాలు. మార్చి 2010న వీరిద్దరి మద్య ఉన్న సంబంధాన్ని బయట పెట్టడమే కాకుండా ఇలాంటి సెక్సు సంబంధించిన అందరి సహాకారం తనకి కావాలని ఎల్ న్యూవో దియా న్యూస్ పేపర్‌కి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ సందర్బంలో రికీ మార్టింగ్ మాట్లాడుతూ హోమో సెక్సువాలిటీ అనేది దేవుడిచ్చిన ఓ అద్బుతమైన 'గిప్ట్' గా అభివర్ణించాడు.


Click it and Unblock the Notifications











