భారత్ పర్యటన ఓ మధురానుభూతి: ఓప్రా విన్‌ఫ్రే
న్యూఢిల్లీ: 57 సంవత్సరాలు వయసు కలిగిన అమెరికన్ టీవీ మొఘల్, టాక్ షో క్వీన్ ఓఫ్రా విన్‌ఫ్రే భారత దేశ పర్యటన ఓ మధురానుభూతిని మిగిల్చిందని తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. జనవరి 16వ తారీఖున ఓప్రా విన్‌ఫ్రే త్వరలో ప్రారంభం కానున్న 'నెక్ట్స్ చాప్టర్' కోసం భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
తొలిసారి భారత పర్యటనకు వచ్చిన విన్‌ఫ్రేకు పరమేశ్వర్ గోద్రేజ్ విలాసవంతమైన విందును ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ విందులో బాలీవుడ్ తారలు అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్‌ఖాన్, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, లారా దత్తా, శిల్పాశెట్టి, అనిల్ కపూర్, ఇమ్రాన్ ఖాన్, నేహా దూపియా, సమీరారెడ్డి, డినో మారియా, ప్రముఖ రచయిత్రి శోభా డే, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ ఆలీలతో పాటు ఫిల్మ్ మేకర్స్ రాజ్ కుమార్ హీరాణి, అశుతోష్ గోవార్కిర్ హాజరయ్యారు.
ముంబైలో అడుగుపెట్టిన ఓఫ్రా విన్‌ఫ్రే ముందుగా.. అమితాబ్ కుటంబాన్ని కలుసుకున్నారు. తమ ఇంటి(జల్సా)ని విన్‌ఫ్రే సందర్శించిందని.. ఐశ్వర్య కూతుర్ని ముద్దు పేరు(బేటి బి)ని దీవించిందని.. చీరలో ఓఫ్రా చాలా అందంగా ఉందని అమితాబ్ ట్విట్టర్‌లో ప్రశంసల్ని కురిపించాడు. 2005లో ఐశ్వర్యరాయ్ తొలిసారిగా విన్‌ఫ్రే టాక్‌షోలో పాల్గొన్నారు. 2009లో తన భర్త అభిషేక్‌తో కలిసి టాక్‌షోకు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఓప్రా విన్‌ఫ్రే ఆగ్రా తాజ్ మహాల్‌ని దర్శించడంతో పాటు, జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











