For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాడిన కండోమ్స్ తీయించేవాడు.. వీర్యాన్ని తుడిచివేయమని.. నగ్నంగా.. ఆ డైరెక్టర్ అక‌‌ృత్యాలు

By Rajababu
|
వాడిన కండోమ్స్ తీయించేవాడు.. వీర్యాన్ని తుడిచివేయమని.. నగ్నంగా..!

హాలీవుడ్ దర్శకుడు హర్వే వీన్‌స్టెయిన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఆగడం లేదు. గత కొద్దినెలలుగా ఒక్కొక్కరు బయటకు వచ్చి హార్వే దారుణాలను బయటపెడుతున్నారు. తాజాగా హర్వేకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఓ భారత సంతతికి చెందిన యువతి సందీప్ రేహాల్ ఆయన వికృతాలను బయటపెట్టింది. ఏన్నో అకృత్యాలకు పాల్పడ్డ హార్వేను విచారించాలని ఆమె 11 పేజీల పిటిషన్ జనవరి 25న కోర్టులో దాఖలు చేసింది. హార్వే పీఏ చెప్పిన విషయాలు ఇవే..

 హార్వే దారుణాలు ఇలా

హార్వే దారుణాలు ఇలా

హర్వే వీన్‌స్టెయిన్ దారుణాలు అంతా ఇంతా కాదు. సెక్స్ సందర్భంగా ఆయన వాడిన కండోమ్స్ నన్ను తీసేయమని చెప్పేవాడు. అమ్మాయిలతో గడిపిన తర్వాత పడకగదిని శుభ్రం చేయమనే వాడు. బెడ్ మీద పడిన వీర్యాన్ని తుడిచి వేయమని చెప్పేవాడు అని సందీప్ రేహాల్ ఇటీవల మీడియాకు వివరించింది.

 మాటల్లో చెప్పలేని విధంగా

మాటల్లో చెప్పలేని విధంగా

నాపై లైంగిక వేధింపులకు పాల్పడినాడు. నేను చెరలో లైంగిక బందీగా మారాను. ఆయన ఆఫీస్ వాతావరణం మాటల్లో చెప్పలేకుండా ఉండేది అని రేహాల్ భయంకరమైన విషయాలను బయటపెట్టింది. 2013 నుంచి 2015 వరకు హార్వే వద్ద రేహాల్ పనిచేసింది.

 ఆఫీస్‌లో దారుణమైన పరిస్థితి

ఆఫీస్‌లో దారుణమైన పరిస్థితి

హార్వే ఆఫీస్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొని ఉండేవి. అలాంటి వాతావరణంలో బలవంతంగా పనిచేయాల్సి వచ్చేది. ఏన్నో లైంగిక వేధింపులు, లైంగికంగా వేధించే సూటిపోటి మాటలతో హింసించే వారు. అవసరం లేకున్నా చెప్పరాని చోట్ల తాకేవారు అని న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సందీప్ రేహాల్ వివరించింది.

హార్వే వీన్‌స్టెయిన్‌పై కోర్టు సీరియస్

హార్వే వీన్‌స్టెయిన్‌పై కోర్టు సీరియస్

సందీప్ రేహాల్ పిటిషన్ నేపథ్యంలో హర్వేపై కోర్టు తీవ్రంగా స్పందించింది. హార్వేకు వెంటనే సమన్లు జారీ చేసింది. 21 రోజుల్లోగా తనపై దాఖలైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

సెక్స్ సామర్థ్యం కోసం డ్రగ్స్

సెక్స్ సామర్థ్యం కోసం డ్రగ్స్

సెక్స్ సామర్థ్యం కోసం ఇంజెక్షన్లు, డ్రగ్స్ (కావెర్‌జెట్) ఇంజెక్షన్లు తీసుకొనేవాడు. వాటిని నాతోనే తెప్పించుకునేవాడు. అలా వాడిన ఇంజెక్షన్లను ఆఫీస్ ఫ్లోర్ మీద, హోటల్ రూమ్‌లు, ఆయన నివాసంలోని ఫ్లోర్ మీద యదేచ్ఛగా పడేసేవాడు అని తన పిటిషణ్ రేహాల్ పేర్కొన్నది.

 శృంగారం జరుపడానికి నాతోనే

శృంగారం జరుపడానికి నాతోనే

శృంగారం జరుపడానికి ముందు కావాల్సిన ఏర్పాట్లన్నీ తనతోనే చేయించేవాడు. ఆ తర్వాత హౌస్ కీపింగ్ సిబ్బంది రాకముందే వాడిన కండోమ్స్ తీయమని చెప్పేవాడు. పడక మీద పడిన వీర్యాన్ని తుడిచి వేయమనే సూచించేవాడు అని రేహాల్ కోర్టు అందజేసిన ఫిర్యాదులో వెల్లడించింది.

 హార్వే నగ్నంగా అరాచకాలు

హార్వే నగ్నంగా అరాచకాలు

హార్వే అరాచకాలు కొన్నిసార్లు మీతిమీరిపోయేవి. ఆఫీస్‌లో నగ్నంగా ఉండేవాడు. ఆయన నగ్నంగా ఉన్న సమయంలో నన్ను ఆయన ముందు కోర్చోపెట్టుకొని నాతో ఈమెయిల్స్ చదివించుకొనే వాడు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో పనిచేశాను అని పిటిషన్‌‌లో రేహాల్ పేర్కొన్నది.

 తొడలపై చేయివేసేవాడు

తొడలపై చేయివేసేవాడు

వాహనంలో గానీ, హెలికాప్టర్‌లో గానీ ప్రయాణించేటప్పుడు నన్ను పక్కనే కూర్చో పెట్టుకొనే వాడు. ఆ సమయంలో నా తొడలపై చేయివేసేవాడు. కాలుపై కాలు వేసుకొని కూర్చుంటే తీవ్రంగా కోపగించుకునేవాడు. నా పిరుదులను తాకుతూ వికృత రూపాన్ని చూపించేవాడు. ఆయన చేష్టలకు భయపడి నేను స్కర్టులు వేసుకోకుండా ప్యాంట్ ధరించడం అలవాటు చేసుకొన్నాను.

 ఆఫీస్‌కు సమీపంలోని గెస్ట్‌హౌస్‌లో

ఆఫీస్‌కు సమీపంలోని గెస్ట్‌హౌస్‌లో

హార్వే కార్యాలయానికి దగ్గర్లోనే తన లైంగిక కార్యకలాపాలకు ఓ గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకొనేవాడు. అందులోకి కావాల్సిన వస్తువులను, అమ్మాయిలకు కావాల్సిన వస్తువులు, దుస్తులు నాతోనే కొనుగోలు చేయించేవాడు.

 నన్ను నేను కాపాడుకోవడానికి

నన్ను నేను కాపాడుకోవడానికి

నన్ను నేను కాపాడుకోవడానికి ఉద్యోగం మానేశాను అని రేహాల్ వెల్లడించింది. తాజాగా సందీప్ రేహాల్ చేసిన ఆరోపణలను హార్వే విన్‌స్టెయిన్ అధికార ప్రతినిధి హోలీ బెయిర్డ్ ఖండించారు.

English summary
Disgraced movie producer Harvey Weinstein has been sued by his former Indian-American personal assistant who has alleged she was made to pick up his used condom, and clean up rooms and semen off his couch. Sandeep Rehal, who was Weinstein’s personal assistant for two years from 2013 to 2015, has sought trial by jury in an 11-page lawsuit.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more