Avatar 3 : రిలీజ్ కు ముందే ‘అవతార్ 3’ని చూసేశారు.. జేమ్స్ కామెరూన్ పై విమర్శలు.. ఏం జరిగిందంటే?
హాలీవుడ్.. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. అత్యాధునిక టెక్నాలజీతో అబ్బురపరిచే సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. యాక్షన్, డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లలో వారి తర్వాతే ఇంకెవ్వరైనా అని చెప్పాలి. హాలీవుడ్ లో విజయకేతనం ఎగరేసిన చిత్రాలు ఇతర భాష చిత్రాలకూ స్ఫూర్తినిస్తుంటాయి. వందేళ్లు ముందుగా ఆలోచించే వారి ఆలోచనల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని సినీ ఇండస్ట్రీలో పండిపోయిన వారే అభిప్రాయపడుతుంటారు. అంతెందుకు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడేలా సినిమాలు తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు కాంబోలో వస్తున్న అడ్వెంచర్ ఫిల్మ్ కు కూడా హాలీవుడ్ లో విజయం సాధించిన 'ఇండియానా జోన్స్' సిరీస్ మాదిరిగానే ఉండబోతుందని జక్కనే రిఫరెన్స్ ఇచ్చారు. వరల్డ్ సినీ పరిశ్రమలో ఆస్కార్ ను ఎక్కువ మార్లు కొల్లగొట్టింది కూడా హాలీవుడ్ టాలెంట్ అనే విషయం తెలిసిందే. అలాంటిది హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ పై ఇప్పుడు నెట్టింట్లో పలు విమర్శలు దర్శనమిస్తున్నాయి. అది కూడా ప్రపంచం మెచ్చిన 'అవతార్' సిరీస్ వల్లనే ఆయనపై నెటిజన్లు వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు...

'ది టర్మినేటర్', 'టైటానిక్', 'అవతార్', 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' వంటి భారీ చిత్రాలతో జేమ్స్ కామెరూన్ ఒక ప్రపంచాన్నే లోకానికి పరిచయం చేశారు. టైటానిక్ తర్వాత అవతార్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రం 'అవతార్'. 2,923 బిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత 'అవెంజర్స్ : ఎండ్ గేమ్', మళ్లీ థర్డ్ ప్లేస్ లో 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' ఉండటం విశేషం. అవతార్ 2తో 2.320 బిలియన్ల డాలర్లను వసూళ్లు చేశాడు జేమ్స్ కామెరూన్. అంటే ఒక స్టేట్ బడ్జెట్ కు సరిపడా డబ్బులను కలెక్షన్ల రూపంలో సాధించింది.
2022 డిసెంబర్ లో జేమ్స్ కామెరూన్ 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్'తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు 'అవతార్ 3'ను రెడీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా Avatar 3పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. అవతార్ : ఫైర్ అండ్ యాష్ గా రూపుదిద్దుకుంటోంది. న్యూజిలాండ్ లో షూటింగ్ కొనసాగుతోంది. అవతార్ 3కి సంబంధించిన పోస్టర్లను ఇప్పటికే రిలీజ్ చేశారు. పైగా అవతార్ : ఫైర్ అండ్ యాష్ ను కొందరు సెలెక్టివ్ పర్సన్స్ కు జేమ్స్ కామెరూన్ చూపించారంట. వారి నుంచి విశేషమైన స్పందన లభించిందని ఆయనే హాలీవుడ్ మీడియాతో పంచుకున్నారు. ఫైర్ క్లాన్ వర్సెస్ విండ్ ట్రేడర్స్ మధ్య జరిగే వారే అవతార్ 3గా చెబుతున్నారు.
అయితే ఈ సిరీస్ కు ఓవైపు బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతుండగానే.. మరి కొందరు మాత్రం అవతార్ 3లో జేమ్స్ కామెరూన్ హాలీవుడ్ సిరీస్ 'అవతార్ : ది లాస్ట్ ఎయిర్ బెండర్'ను కాపీ కొట్టారని రూమర్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్, ఎర్లీ స్క్రీనింగ్ తో బయటికి వచ్చిన సమాచారంతో సన్నివేశాలు చూడ్డానికి అలానే ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంతున్నదనేది అవతార్ 3 విడుదలైతేనే తెలుస్తుంది. మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ తో వరల్డ్ ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 3 గంటల పాటు థర్డ్ పార్ట్ ఉండబోతుందని కూడా తెలపడంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అవతార్ 3 2025 డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











