అర్దరాత్రి ఆ హీరోయిన్ ఇంట్లో నీకేం పని: పోలీసులు

By Nageswara Rao

నల్లజాతి కలువ పువ్వు హాలీబెర్రీ హాలీవుడ్ హిల్స్‌లో ఉన్న తన ఇంట్లోకి దోంగ దూరడంతో పోలీసులకు సమాచారం అందించగా అతనిని పట్టుకోవడం జరిగింది. వివరాలలోకి వెళితే 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి రిచర్డ్ ఆంటోని ఫ్రాన్సో అనే యువకుడు రాత్రి 11గంటలకు హాలీబెర్రీ ఇంటి వెనుకభాగన నుండి ఇంట్లోకి ప్రవేశించడానకి ప్రయత్నించగా అతనిని హాలీబెర్రీ బాడీగార్డ్స్ పట్టుకోని పోలీసులకు అప్పగించడం జరిగిందని అన్నారు. దాంతో రిచర్డ్ ఆంటోని ఫ్రాన్సో $150,000 జరిమానా కట్టి కోర్టు నుండి బెయిల్ తెచ్చుకోవడం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

అంతకు ముందు హాలీబెర్రీ ఇంట్లో శనివారం, ఆదివారం కొన్ని వస్తువులు, డబ్బు దోంగతనం చేయబడింది. ఈ కేసులో రిచర్డ్ ఆంటోని ఫ్రాన్సో ని విచారించగా ఆ దొంగతనాలకు నాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఐతే రిచర్డ్ ఆంటోని ఫ్రాన్సో క్లిమినల్ చరిత్రను కలిగి ఉన్నాడు. గతంలో రెండు సార్లు జైలుకి కూడా వెల్లి వచ్చిన దాఖాలాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. రిచర్డ్ ఆంటోని ఫ్రాన్సో పై గతంలో కారు దొంగతనాలు, డ్రగ్స్ కేసులు, జ్యూయలరీ కేసులకు సంబందించి కేసులు నమోదు అయ్యాయని లాస్ ఏంజిల్స్ పోలీసులు తెలియజేశారు. అసలు రిచర్డ్ ఆంటోని ఫ్రాన్సో‌ని ఎందుకు హాలీబెర్రీ ఇంట్లోకి ప్రవేశించావు అని ప్రశ్నించగా అందుకు మాత్రం సమాధానం చెప్పడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X