twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐపిఎల్ 6 కోసం.... జెన్నిఫర్ లోపెజ్ గొంతెమ్మ కోర్కెలు

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ: హాలీవుడ్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' 6వ సీజన్ ఓపెనింగ్ సెర్మనీలో ఆమెతో పెర్ఫార్మెన్స్ ఇప్పించాలని నిర్ణయించారు నిర్వాహకులు. అయితే అమ్మడు కోరికలు ఓవర్ గా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

    దీంతో 60 మిలియన్ల మంది వీక్షించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాన్ని చేజేతులారా పొగొట్టుకుంది జెన్నిఫర్. 43 ఏళ్ల ఈ సుందరి తాను వచ్చి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే...తన బృందంతో రావడానికి ఓ ప్రైవేట్ విమానం ఏర్పాటు చేయాలని, తన పరివారమంతా బస చేయడానికి స్టార్ హోటల్స్‌లో డజన్ల కొద్దీ హోటల్ రూమ్స్ బుక్ చేయాలని, తన స్టైలిస్ట్స్, అసిస్టెంట్స్, మేనేజర్ కు లగ్జరీ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసిందట.

    ఆమె గొంతెమ్మ కోర్కెలతో విసుగు పుట్టిన ఐపీఎల్ నిర్వాహకులు... ఆమెతో షో ఇప్పించాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆమె డిమాండ్లు దారుణంగా ఉన్నాయని, ఆమె రెమ్యూనరేషన్ తో పాటు ఇవన్నీ కల్పించాలంటే తలకు మించిన భారమే అవుతుందని ఐపీఎల్ 6 నిర్వాహకులు అంటున్నారు.

    అయితే జెన్నిఫర్ స్పోక్ పర్సన్ వాదన వేరేలా ఉంది. ఆమె తన ఆల్బం రికార్డింగులో బిజీగా ఉండటం వల్లనే ఐఫీఎల్-6లో పదర్శన ఇవ్వడం కుదరదని చెప్పిందని మీడియాకు వెల్లడించారు.

    English summary
    Hollywood actress-singer Jennifer Lopez reportedly got herself axed from an Indian Premier League (IPL) gig to perform for 60 million viewers when she gave the organizers a long list of unessential demands. The 43-year-old insisted on a private plane and dozens of hotel rooms for her huge entourage, including her stylists, assistants and chef, reports thesun.co.uk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X