twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అస్కార్ అవార్డ్ గెలుచుకుని, పంక్షన్ ని బహిష్కరించిన దర్శకుడు,అసలేం జరిగింది

    ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుకుకున్న ఇరాన్ చిత్రం ది సేల్స్ మ్యాన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించారు.

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : తాను తీసిన సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే బోయ్ కాట్ చేయాలని ఎవరూ అనుకోరు. కానీ ఇరానీ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ అదే నిర్ణయానికి వచ్చారు. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాలతో పోటీ పడుతూ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ గెలిచిన ఆయన ... తనకు అక్కర్లేదంటూ ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌ను బహిష్కరించారు. ఆయన ఆ నిర్ణయం తీసుకోవటానికి కారణం... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

    పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుకుకున్న ఇరాన్ చిత్రం ది సేల్స్ మ్యాన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు నిరసనగా తానీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అస్ఘర్ పర్హాదీ పేర్కొన్నారు.

    ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గైర్హాజరైనప్పటికీ పర్హాదీ పంపిన సందేశం మాత్రం ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా మారింది. ఆ సందేశాన్ని సేల్స్ మ్యాన్ చిత్ర బృందం ప్రతినిథి ఒకరు చదివారు. ఆ సందేశంలో ఆయన డోనాల్డ్ ట్రంప్ విధానాలపై ఘాటైన విమర్శలు చేశారు.

    Iran's 'The Salesman' Wins Best Foreign Film; Director Asghar Farhadi Boycotts the Ceremony

    ట్రంప్ విధానాలతో అగౌరవపడిన ప్రజలకు సంఘీభావంగా తాను ఆస్కార్ ఫంక్షన్‌కు దూరంగా ఉంటున్నట్లు తన పేరుతో పంపిన ప్రకటనతో ఫర్హాదీ పేర్కొన్నారు.ప్రపంచాన్ని అమెరికా, దాని శత్రువులుగా విభజించడం ద్వారా మిగిలిన దేశాలకు ఒకరకమైన భయం కలిగించారని, ఇది యుద్ధ కాంక్షతో కూడిన దాడిలాంటిదేనని ఆయన అన్నారు.

    ఫర్హాదీ పంపిన సందేశాన్ని ఇరాన్‌లో పుట్టి, అమెరికాలో ఇంజనీర్‌, వ్యోమగామి అయిన అనౌషే అన్సారీ ఆస్కార్ వేదికపై చదివి వినిపించారు. ఈ యుద్ధాలు ప్రజాస్వామ్యాన్ని, మానవహక్కులను హరిస్తాయని కూడా ఫర్హాదీ అన్నారు. కాగా, అస్ఘర్ ఫర్హాదీకి విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం ఇది రెండోసారి.

    ఇంతకుముందు ఆయన 2011 సంవత్సరంలో 'ఎ సెపరేషన్' అనే సినిమాకు కూడా అవార్డు పొందారు. పెళ్లయిన దంపతులలో భార్య మీద అపార్టుమెంటులో దాడి జరిగిన తర్వాత వాళ్లిద్దరూ ప్రశాంతమైన జీవితం, న్యాయం కోసం చేసే పోరాటమే 'ద సేల్స్‌మన్' చిత్రం ఇతివృత్తం.

    89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాజరై అవార్డుల ప్రదానోత్సవానికి మరింత వన్నె తెచ్చారు. ఉత్తమ సహాయనటుడుగా అలీ (మూన్‌లైట్‌) అవార్డును అందుకున్నారు. అయితే ఆస్కార్‌ అందుకున్న మొదటి ముస్లిం నటుడు అలీ కావడం విశేషం.

    ఉత్తమ సహాయనటిగా వివోలా డేవిస్‌ (ఫెన్సెస్‌) అవార్డును అందుకోగా భారత నటుడు దేవ్‌ పటేల్‌కు నిరాశే మిగిలింది. ఉత్తమ మేకప్‌& హెయిర్‌ స్టైలింగ్-క్రిస్టఫర్‌‌గా నిల్సన్ (సూసైడ్‌ స్క్వాడ్‌), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ (ఓజే మేడిన్‌ అమెరికా), సౌండ్ ఎడిటింగ్- బెల్లీమార్‌ (అరైవల్‌), సౌండ్‌ మిక్సింగ్‌ (హక్సా రిట్జ్‌), ఉత్తమ్‌ కాస్ట్యూమ్‌- కొలెన్‌ ఎట్‌ఉడ్ (ఫెంటాస్టిక్‌ బీస్ట్‌) కు దక్కాయి.

    ఉత్తమ విదేశీ చిత్రంగా- ది సేల్స్‌మ్యాన్‌ (ఇరాన్‌), ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ (పైపర్‌), సెట్‌ డెకరేషన్‌ (లాలా ల్యాండ్), గౌరవ ఆస్కార్‌ అవార్డు గ్రహీత- జాకీచాన్‌ ది సేల్స్‌మ్యాన్‌, ఉత్తమ దర్శకుడు అస్గర్‌ ఫర్హాది అవార్డును దక్కించుకున్నారు.

    English summary
    Iranian film The Salesman on Sunday won the Oscar for best foreign language film, with director Asghar Farhadi skipping the Hollywood gala in protest at a travel ban by US President Donald Trump.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X