twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్ధనగ్న ఫొటోల వివాదం...ఎడిటర్ రాజీనామా

    By Srikanya
    |

    లండన్ : అత్యుత్సాహం ఒక్కోసారి కొంపముంచుతుంది. ముఖ్యంగా మీడియాలో ఆచితూచి అడుగులు వేయకపోతే ఒక్కోసారి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. తాజాగా బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్‌టన్ అర్ధనగ్న ఫొటోల ప్రచురణ వివాదం నేపథ్యంలో ఐరిష్ డెయిలీ స్టార్ ఎడిటర్ మైఖేల్ ఓకేన్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్‌లో మైఖేల్‌ను సస్పెండ్ చేసిన పత్రిక యాజమాన్యం.. యువరాణి ఫొటోల ప్రచురణ అంశంపై అంతర్గతంగా దర్యాప్తు జరిపించింది.

    ఈ ఏడాది సెప్టెంబర్‌లో యురాజు విలియమ్స్, కేట్ దంపతులు ప్రాన్స్‌లో పర్యటించారు. ఆ సమయంలో యువరాణి స్నానం చేస్తుండగా తీసిన ఫొటోలు బయటకివచ్చాయి.

    ఆమె అర్ధనగ్నంగా కనిపించే ఫొటోలను మొదటగా.. క్లోజర్ అనే మేగజైన్ ప్రచురించింది. ఆ తర్వాత బ్రిటన్‌లో ఉన్న కొన్ని పత్రికలతో పాటు.. ఐరిష్ డెయిలీలో కూడా ఈ ఫొటోలు ప్రచురితమయ్యాయి. తమ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజు కుటుంబం ప్రెంచ్ మేగజైన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎడిటర్ మైఖేల్ తన పదవికి రాజీనామా చేసినట్లు పత్రిక యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

    ఇక ఈ పత్రిక హాలీవుడ్ చిత్రాల కవరేజ్ బాగా ఇచ్చేది. ఆ హీరోయిన్స్ ఫోటోలును గతంలో ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించేవారు. అదే రూటులో ఈ యువరాణి బొమ్మలు ప్రచురించటంతో వివాదం మొదలైంది. మొదట ఈ వివాదం పబ్లిసిటీకి పనికివస్తుందనుకుంటే నిరసన పెరిగి చివరకు పత్రిక ఎడిటర్ రాజీనామా చేసే స్ధితికి తీసుకెళ్ళే స్దితికి వెళ్లింది.

    English summary
    
 The editor of the Irish Daily Star newspaper has resigned in the wake of the controversial publication of topless photographs of the Duchess of Cambridge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X