Iron Man వేలానికి స్టార్ హీరో నమిలేసిన చూయింగ్ గమ్‌.. ఎన్ని లక్షలు పలికిందంటే?

సాధారణంగా వేలంపాటలో పురాతనమైన వస్తువులు, అరుదైన వస్తువులను అమ్మకానికి పెడతారన్న విషయం తెలిసిందే. అందుకే అలాంటి వస్తువులను ఎంతో ధర చెల్లించి మరి కొనుక్కుని దక్కించుకుంటారు కొంతమంది ఔత్సాహికులు. అయితే తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ వేలం పాటలో ఒక స్టార్ హీరో నమిలి పడేసిన చూయింగ్ గమ్ కు నోరు వెళ్లబెట్టేంతా లక్షల్లో ధర పలికింది. ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే ఈ చూయింగ్ గమ్ వేలం పాట ఏ స్టార్ హీరోది.. ఏంటీ ఈ కథ అనే వివరాల్లోకి వెళితే..

మార్వెల్ చిత్రాలతో పాపులర్..

మార్వెల్ చిత్రాలతో పాపులర్..


రాబర్ట్ డౌనీ జూనియర్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఐరన్ మ్యాన్ అంటే మాత్రం హాలీవుడ్ చిత్రాలు చూసే వారికి మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. ఈ ఐరన్ మ్యాన్ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్ గెటప్పే ఓ సినిమాలో బాలయ్య బాబు లుక్ ఉందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. ఇది పక్కన పెడితే.. రాబర్ట్ డౌనీ జూనియర్ ఎక్కువగా మార్వెల్ చిత్రాలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. 'అవేంజర్స్: ఎండ్ గేమ్', ఐరన్ మ్యాన్ 1, 2, 3, షేర్లాక్ హోమ్స్ వంటి సినిమాల్లో తన స్టైలిష్ పర్ఫామెన్స్ తో కోట్లాది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.

గత నెలలో జరిగిన..

గత నెలలో జరిగిన..

ఇక 'అవేంజర్స్: ఎండ్ గేమ్' సినిమా వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని అందుకుంది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో టాప్ ప్లేస్ లో స్థానం సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమానే కాకుండా ఎన్నో చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనతో అలరించే రాబర్ట్ డౌనీ జూనియర్ నిమిలి పారేసిన చూయింగ్ గమ్ కు వేలం నిర్వహించారు. గత నెలలో జరిగిన 'జోన్ ఫావ్ రూ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్' వేడుకల్లో డౌనీ నమిలి ఊసిన చూయింగ్ గమ్ ముక్కను eBay వేలం వేసింది.

ఇంకా కొనసాగుతూనే..

ఇంకా కొనసాగుతూనే..

eBay వేసిన ఈ వేలంలో రాబర్ట్ చూయింగ్ గమ్ ధర 40 వేల డాలర్ల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 55 వేల డాలర్ల వరకు చేరుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని ధర సుమారుగా రూ. 45 లక్షలు. అయితే ఈ ధరకు కూడా ఎవరు దక్కించుకోలేదు. గత నెలలో ప్రారంభమైన ఈ వేలం పాట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కువ వేలం పాడిన వారికి ఈ చూయింగ్ గమ్ ను నిర్వాహకులు పంపించనున్నారు.

ఇలా క్యాష్ చేసుకుంటున్నారు..

ఇలా క్యాష్ చేసుకుంటున్నారు..

అయితే ఈ వేలం పాటపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ కూడా చేస్తున్నారు. 'సినీ నటుల మీద ఉండే అభిమానాన్ని కొందరు ఇలా క్యాష్ చేసుకుంటున్నారు' అని విమర్శిస్తున్నారు. 'నమిలి పారేసిన తర్వాత అది ఒక వ్యర్థ పదార్థం మాత్రమే. వ్యర్థాన్ని వేలానికి పెడతారా' అని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఈ చూయింగ్ గమ్ వేలం వరల్డ్ వైడ్ గా షాక్ కు గురి చేస్తోంది.

వెర్రి ప్రజలు.. డౌనీ DNA..

eBay నిర్వహించిన రాబర్ట్ డౌనీ జూనియర్ నమిలేసిన చూయింగ్ గమ్ వేలం చూసి ఇంటర్నెట్ ఆశ్చర్యపోయింది. చూయింగ్ గమ్ కోసం ఇంత డబ్బు ఖర్చు చేసేంత వెర్రి ప్రజలు ఎలా ఉన్నారని ట్విట్టర్ లో ఓ పెద్ద విభాగం వ్యాఖ్యానించింది. అయితే ఈ బిడ్ లో గెలుపొందిన వ్యక్తి ఆ ఐరన్ మ్యాన్ నటుడు అయిన రాబర్ట్ డౌనీ జూనియర్ DNAను కలిగి ఉండవచ్చని కొందరు సెటైరికల్ గా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X