61 ఏళ్ల ఏజ్‌లో మూడోసారి పెళ్లికి స్టార్ హీరో.. 35 ఏళ్ల బిజినెస్ మ్యాగ్నెట్‌తో బ్రాడ్ పిట్ అఫైర్

సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ మూడో పెళ్లికి సిద్దమవుతున్నాడనే వార్త హాలీవుడ్‌లో హల్ చల్‌గా మారింది. ఆయన తన జీవితంలో లేటు వయసులో మూడోసారి ప్రేమలో పడ్డాడు. గతంలో రెండు పెళ్లిళ్లు పెటాకులు కాగా.. ఈ సారి సంపన్నురాలైన బిజినెస్ ఉమెన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఈ స్టార్ హీరో గతంలో ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు? ప్రస్తుతం ఎవరితో అఫైర్ కొనసాగిస్తున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ తన లైఫ్‌లో తొలిసారి ప్రముఖ హీరోయిన్ జెన్నిఫర్ ఆనిస్టన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వారిద్దరూ 2000 సంవత్సరంలో వివాహం చేసుకోన్నారు. దాదాపు 5 ఏళ్లు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. అయితే వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లు అంటే 9 ఏళ్లు సింగిల్‌గానే ఉన్న ఆయన ప్రముఖ నటి ఎంజెలీనా జోలీతో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ 2014లో వివాహం చేసుకొన్నారు.

Brad Pitt

బ్రాడ్ పిట్, ఎంజెలీనా దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది. ఇద్దరు అన్యోన్యంగానే లైఫ్‌ను లీడ్ చేశారు. అయితే బ్రాడ్ పిట్ వేధింపుల తట్టుకోలేక ఎంజెలీనా విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. మద్యానికి బానిస అయిన ఆయన తనను వేధించాడు. నా పిల్లలకు ఆయనతో ప్రమాదం ఉందని ఆరోపించారు. ఆయన నుంచి భారీగా భరణాన్ని ఆశిస్తూ కేసు నమోదు చేశారు. ఎంజెలీనాకు భారీ భరణాన్ని ఇచ్చేందుకు సిద్దపడి విడాకులు తీసుకొనేందుకు సిద్దపడ్డాడు. 2019 సంవత్సరం నుంచి ఎంజెలీనా, బ్రాడ్ పిట్ వేర్వేరుగా ఉంటారు.

గత 6 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్న బ్రాడ్ పిట్ మరోసారి ప్రముఖ వజ్రాల వ్యాపారి, 35 ఏళ్ల ఐనెస్ డే రామోన్‌‌తో అఫైర్ చేస్తున్నాడనే వార్త మీడియాలో షికారు చేస్తున్నది. అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తూ పలు చోట్ల మీడియా కంటికి చిక్కారు. దాంతో వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌పై క్లారిటీ వచ్చేసింది. అయితే రామోన్‌కు ఇది వరకే వివాహం జరిగి భర్తతో విడాకులు తీసుకొన్నారు.

ఐనెస్ డే రామోన్ విషయానికి వస్తే.. స్విస్ దేశానికి చెందిన వజ్రాలు, అభరణాల బిజినెస్‌లో ఉన్నారు. అనితా కో అనే కంపెనీకి ఆదినేతగా వ్యవహరిస్తున్నారు గతంలో పాల్ వెస్లీ అనే ప్రముఖుడితో వివాహం జరిగింది. వారిద్దరి దాంపత్య జీవితం 2019 సంవత్సరం నుంచి 2024 వరకు సాగింది. వ్యక్తిగత కారణాల వల్ల 2024 సంవత్సరంలో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. న్యూజెర్సీలో జరిగిన బోనో కాన్సర్ట్ సమయంలో బ్రాడ్ పిట్, రామోన్ కలిసి చెట్టాపట్టాల్ వేసుకోని కనిపించడంతో వారి అఫైర్ విషయం బయటకు పొక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X