బ్రిట్నీ బుక్కయిపోయిందా...??
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్ అయిపోయిందా?? అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. దీనికి రుజువు లేకపోలేదండోయ్. ఆమె తాజాగా వెడ్డింగ్ రింగుకు ఓ రింగు పెట్టుకుని కనిపించిందని ది మిర్రర్ పత్రిక ఫోటోతో సహా ఓ వార్తను ప్రచురించింది. ఆమెను చూసిన వారు కూడా ఈ రింగు చూసి ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు బ్రిట్నీ రెండు సార్లు వివాహం చేసుకున్నారు. అవి రెండూ వివాదాశ్పదమయి పెటాకులు అయ్యాయి. మొదటి వివాహం తన స్కూల్ ఫ్రెండ్ జాసన్ అలెగ్జాండర్ తో కాగా, అది కేవలం 55 గంటల్లో ముగిసిపోయింది. ఆ తర్వాత కెవిన్ ఆమె వివాహం చేసుకున్నారు. అది ఎంత వివాదాశ్పదమయి ముగిసిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో బ్రిట్నీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
ఆ తర్వాత తన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో ఆమె తిరిగి మామూలు స్థితికి వచ్చి, ఇటీవలే తిరిగి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ ప్రదర్శనల్లో భాగంగా ప్రపంచ పర్యటనలో వుండగా తన మిత్రుడు, మేనేజర్ జాసన్ ట్రావిక్ ను వివాహం చేసుకోవాలని భావించి అతనికి చెప్పగా, ఆమె ప్రతిపాదనను అతను సున్నితంగా తిరస్కరించాడు. దీంతో ఆమె అతన్ని ఇంటికి వెళ్లిపొమ్మని కోరిందట. ఆ తర్వాత ఇటీవలే వారిద్దరూ కలసి డిన్నర్ కు వెళ్లినప్పుడు ఆమె వెడ్డింగ్ రింగుతో కనిపించిది. మరి ఆమె ఎవరిని ఎంగేజ్ మెంట్ చేసుకుంది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











