twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యారీపోటర్ యాక్టర్‌కు కరోనా వైరస్.. ట్వీట్‌పై ధ్వజమెత్తిన నెటిజన్లు..

    |

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. కోవిడ్-19 పాజిటివ్‌గా ధృవీకరించిన కేసులో పెద్ద మొత్తంలో నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు తమకు సాధ్యమైన మేరకు జాగ్రత్తలు సూచిస్తున్నది. తాజాగా హాలీవుడ్ నటుడు, హ్యారీపోటర్ ఫేం డేనియల్ రాడ్‌క్లిఫ్‌కు కరోనా వైరస్ సోకిందనే వార్తను బీబీసీ న్యూస్ వెల్లడించింది. అయితే అది వివాదాస్పదం కావడంతో రచ్చ రచ్చ జరిగింది.

    బీబీసీ న్యూస్ తెలిపిన ప్రకారం.. బ్రేకింగ్.. తాజా పరీక్షల్లో డేనియల్ రాడ్‌క్లిఫ్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు బహిరంగంగా వెల్లడించిన తొలి సెలబ్రిటీ ఆయనే అంటూ బీబీసీ ట్వీట్ చేసింది.

     Is Harry Potter star Daniel Radcliffe test COVID-19 positive?

    డేనియల్ రాడ్‌క్లిఫ్ కరోనా వైరస్ బారిన పడ్డారని వార్త బయటకు రాగానే అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆ వార్త నమ్మలేని ఫ్యాన్స్.. అది ఫేక్ వార్త అని కొట్టిపారేశారు. ఈ వార్త వైరల్‌గా మారిన సమయంలో డేనియల్ అధికార ప్రతినిధి అందులో వాస్తవం లేదు అని ధృవీకరించారు.

    Recommended Video

    Prabhas Spotted At Hyderabad Airport With Coronavirus Mask || Filmibeat Telugu

    నెటిజన్లు, ఇతరులు ఈ వార్తపై ధ్వజమెత్తడంతో వెంటనే ట్వీట్‌ను తొలగించారు. ఫేక్ న్యూస్‌ను పాపులర్ మీడియాను ప్రచారం చేయడంపై ఎండగడుతున్నారు. కేవలం పాపులారిటీ కోసం ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని సూచిస్తున్నారు.

    English summary
    on of famous medias Twitter page announced that 'Harry Potter' actor Daniel Radcliffe is reportedly the first famous person to be tested positive for Coronavirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X