స్టార్ హీరో, హీరోయిన్ మ్యారేజ్ బ్రేకప్.. ఆమెకు 5.. ఆయనకు 3వ ‘సారీ’.. వారెవరో తెలుసా?
హాలీవుడ్‌లో స్టార్ కపుల్ జెన్నీఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ మరోసారి బ్రేకప్ చెప్పుకోవడం సినీ వర్గాల్లోను, మీడియాలోను భారీ చర్చకు దారి తీసింది. అయితే గతంలో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని ఇటీవల ఒక్కటైన ఈ సెలబ్రిటీ జంట.. మళ్లీ అదే దారిలో ప్రయాణించడం వారి జీవితాల్లో మరింత వివాదాస్పదంగా మారింది. అయితే జెన్నీఫర్, బెన్ అఫైర్, బ్రేకప్ గురించిన వివరాల్లోకి వెళితే..
నటి, గాయని, డ్యాన్సర్, వ్యాపారవేత్త జెన్నిఫర్ లోపేజ్, నటుడు బెన్ అఫ్లేక్ తొలిసారి 2002 నుంచి 2004 వరకు అంటే రెండేళ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయి ఎవరికి వారు లైఫ్‌ను లీడ్ చేశారు. అయితే వారిద్దరు వేరే వారితో డేటింగ్, అఫైర్లు నడిపిన తర్వాత 2021 ఇద్దరు కలిశారు. వారిద్దరూ డేటింగ్ చేయడం హాలీవుడ్‌లో ఆశ్చర్యానికి గురి చేసింది.

జెన్నీఫర్ లోపేజ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు బెన్ అఫ్లేక్ తొలిసారి 2022 లో అధికారికంగా వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం మొదటి లవ్ ప్రపోజల్ తర్వాత వారిద్దరు రెండోసారి ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు. అనంతరం 2022 సంవత్సరంలో జూలై 16వ తేదీన లాస్ వెగాస్‌లో వివాహం చేసుకొన్నారు.
గత రెండేళ్లుగా బెన్, జెన్నీ ఇద్దరు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించారు. ఇటీవల వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. వారిద్దరి మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరడంతో ఇంటి నుంచి ముళ్లెమూట సర్దుకొని వేరే చోటకు వెళ్లినట్టు తెలిసింది. ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తున్న బెన్‌కు దూరంగా ఉండటం కూడా వారిద్దరి బ్రేకప్‌కు బలమైన సాక్ష్యంగా నిలిచింది.

జెన్నిఫర్, బెన్ అఫ్లెక్ బ్రేకప్ వార్త ఓ వైపు ట్రెండ్ అవుతుంటే.. వారిద్దరికి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల విలువైన రాయల్ ప్యాలెస్ అమ్మకానికి పెట్టినట్టు రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. దాంతో ఇద్దరు విడిపోయినట్టు ఇంకా బలంగా ధృవీకరణ జరిగింది.
జెన్నీఫర్ లోపేజ్ దాంపత్య జీవితానికి వస్తే.. ఇది ఆమెకు అధికారికంగా 5వ సారి బ్రేకప్. గతంలో ఓజానీ, మార్క్ ఆంథోని, క్రిస్ జూడ్‌తో బ్రేకప్ జరుగగా.. బెన్ అఫ్లెక్‌తో రెండుసార్లు బ్రేకప్ జరిగింది. బెన్ అఫ్లెక్ విషయానికి వస్తే.. ఇది మూడోసారి బ్రేకప్. గతంలో జెన్నిఫర్ గార్నర్, ప్రస్తుతం జెన్నిఫర్‌తో విడాకులు జరిగాయి.


Click it and Unblock the Notifications











