అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న £100m ఇష్యూ

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్, జూన్ 24: హాలీవుడ్ సెలబ్రిటీ జంటగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జానీ డెప్, వెనెస్సా పారదిస్ విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గత 14 సంవత్సరాలుగా కలిసి జీవితాన్ని గడిపిన వీరిద్దరూ తీసుకున్నారు. ఈ విషయాన్ని జానీ డెప్ అధికార ప్రతినిధి అధికారకంగా ప్రెస్ రిలీజ్‌ ద్వారా విడుదల చేశారు. ప్రెస్ రిలీజ్‌లో జానీ డెప్ అతని భార్య వెనెస్సా ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోతున్నారని ఉంది.

ఐతే గత 14 సంవత్సరాల నుండి వీరిద్దరూ కలిసి జీవిస్తున్నప్పటికీ... పెళ్లి మాత్రం చేసుకోలేదు. తన పాట్నర్ వెనెస్సా పారదిస్ నుండి విడిపోతునందుకు గాను జానీ డెప్ సుమారు 100 మిలయన్ల పౌండ్స్‌ను చెల్లించనున్నట్లు రూమర్స్ హాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విడిపోతునందుకు పెద్దగా ఆశ్చర్యపడని అభిమానులు మాత్రం జానీ డెప్ ఇచ్చే సెటిల్ మెంట్‌‌ అందిరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

జానీ డెప్, వెనెస్సా పారదిస్ గత పద్నాలుగు సంవత్సరాలుగా సహాజీవనం సాగిస్తున్నారు. ఒక మనిషితో ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించడం అనేది హాలీవుడ్‌లో చాలా గొప్ప విషయం. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి చేసుకోలేదు కాబట్టి.. విడాకులు తీసుకోవడం అనే ఛాన్సు లేదు. ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించినందుకు గాను జానీ డెప్ ఈ నిర్ణయం తీసుకోని ఉండాడని అందరూ భావిస్తున్నారు.

జానీ డెప్ ఆస్తి 200 మిలియన్ల పౌండ్స్‌ను కలిగి ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా ఎన్నో ఆస్తులను తన పేరున కలిగి ఉన్నాడు. తన ఆస్తిలో సగ భాగాన్ని వెనెస్సా పారదిస్ ఇవ్వడం ద్వారా తన పిల్లలు భవిష్యత్తుకి సెక్యూరిటీని కల్పించినవాడు అవుతాడు. ప్రెంచ్ సింగరైన వెనెస్సా పారదిస్ బేవరీ హిల్స్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ను ఇప్పటికే మార్కెట్లో పెట్టింది.

1998 వేసవి: నాలుగు సంవత్సరాలుగా సూపర్ మోడల్ కేట్ మోస్‌తో డేటింగ్ చేసిన జానీ డెప్ పారిస్ లోని ఓ హోటల్‌లో వెనెస్సాని కలిశాడు.

మే 1999: కుమార్తె లిల్లీ-రోజ్ మెలోడీ పుట్టింది.

ఏప్రిల్ 2002: సన్ జాన్ 'జాక్' క్రిస్టోఫర్ పుట్టాడు.

ఫిబ్రవరి 2008: ఇద్దరూ కలిసి అకాడమీ అవార్డుల ఫంక్షన్‌కి హాజరయ్యారు.

మే 2010: జానీ డెప్, వెనెస్సా ఇద్దరూ కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఛానల్ పార్టీకి హాజరయ్యారు. వీరిద్దరి కలయికతో హాజరైన చివరి పార్టీ ఇదే కావడం విశేషం.

జనవరి 2012: ఫ్రెంచ్ టీవి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వెనెస్సా, డెప్ విడిపోతున్నారని వాదనను వెనెస్సా ఖండన.

ఏప్రిల్ 2012: జానీ డెప్ తో కలిసి డార్క్ షాడోస్ నటించిన కోస్టార్ ఆంబర్ హెర్డ్ .. డెప్ ప్రయివేట్ జెట్‌లో లాస్ వేగాస్‌లో ప్రమోషన్‌లో పాల్గోనడం.

మే 2012: డార్క్ షాడోస్ లండన్ ప్రీమియర్ షో లో జానీ డెప్.. వెనెస్సా విడిపోనున్న వార్తలు ఖండన.

జూన్ 2012: జానీ డెప్ అధికార ప్రతినిధి.. స్నేహా పూర్వకంగా జానీ డెప్, వెనెస్సా విడిపోతున్నారని అధికారిక ప్రకటన.

దీనిని బట్టి చూస్తుంటే జానీ డెప్‌తో డార్క్ షాడోస్ లో తనతో పాటు నటించిన కోస్టార్ ఆంబర్ హెర్డ్ తో ప్రేమలో పడడం వల్లనే వెనెస్సా నుండి విడిపోయినట్లు హాలీవుడ్ లో వీరికి బాగా కావాల్సిన దగ్గరి బంధువులు గుసగుస లాడుతున్నారు.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X