twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టామ్ క్రూయిజ్ మాజీ భార్య ఆ స్టార్ హీరోతో డేటింగ్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: ఐదు సంవత్సరాల పాటు తన భర్తతో కలిసి జీవించి ఇటీవల విడాకులు తీసుకున్న హాలీవుడ్ స్టార్ హీరోయిన్, టామ్ క్రూయిజ్ మాజీ భార్య క్యాటీ హాల్మస్ విడాకుల అనంతరం హీరో జెరెమీ స్ట్రాంగ్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారని సమాచారం. వీరిద్దరూ 2010లో విడుదలైన 'ది రొమాంటిక్స్' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సాన్నిహిత్యంతో క్యాటీ హాల్మస్, జెరెమీ స్ట్రాంగ్ ఇద్దరూ కలిసి గతవారాంతం డే టైమ్‌లో "If You Haven't Found It Yet" అనే సినిమాని వీక్షించినట్లు ప్రముఖ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

    క్యాటీ హాల్మస్ క్రీమ్ షర్ట్‌ని ధరించి చిన్న చిన్న డాట్స్ కలిగిన స్కర్ట్‌తో చూసేందుకు ఎంతో అందంగా కనిపించింది. ఈ ప్రక్కనున్న చిత్రంలో మీరు ఆ విషయాన్ని చూడొచ్చు. మొట్టమొదటి సారి పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు తన వెంట తన 6 ఏళ్ల కూతురు సూరి క్రూయిజ్ లేకుండా కనిపించారు. ఇటీవల కాలంలో క్యాటీ హాల్మస్ పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు తన వెంట్ తన కూతురు కూడా ఉండడం మనం గమనించాం.

    టామ్ క్రూయిజ్, క్యాటీ హాల్మస్ ఇద్దరూ ఐదు సంవత్సరాల పాటు కలిసి జీవించిన తర్వాత ఇటీవలే అధికారకంగా విడిపోయారు. హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇటీవల విడాకులు తీసుకున్న టామ్ క్రూయిజ్ - క్యాటీ హాల్మస్‌ల గురించి తెలిసి చాలా బాధపడ్డారు. విడాకుల సెటిల్‌మెంట్‌లో ఓ ఒక్కరూ గెలిచినట్లు కాదని తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆ సమయంలో నేను దక్షిణ అమెరికాలో ఉన్నాను. నిజంగా ఈ వార్త నా మనసుని కలచివేసింది.

    టామ్ - హాల్మస్ ఇద్దరూ చూడచక్కని జంట. మంచి కపుల్. గత యేడాది నేను, నా భర్త మార్క్ ఆంటోనీ విడాకులు తీసుకున్నట్లు వీరు కూడా విడాకులు తీసుకున్నారని చెప్పింది. విడాకుల తీసుకోవాలని ఎవరూ భావించరు. ఒకసారి విడాకులు తీసుకునే మందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మీకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరని అంది. కానీ కొన్ని సందర్బాలలో క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలను తీసుకోని, వాటికి కట్టుబడి ఉండాల్సి వస్తుందని వాపోయింది.

    తెలుగు వన్ఇండియా

    English summary
    After her divorce from actor Tom Cruise, actress Katie Holmes has been seen spending time with actor Jeremy Strong.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X