సింగర్ తో ప్రేమలో పడినటువంటి సూపర్ ఫ్యాషన్ మోడల్
ప్యాషన్ మోడల్ లారా బింగిల్ ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి ఫోటో కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా లారా బింగిల్, సింగర్ సాంగ్ రైటర్ జాసన్ డ్యూర్లోతో కలసిదిగినటువంటి ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేయడానికి గల కారణాలను వెతుకున్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఫ్యాషన్ మోడల్ లారా బింగిల్ జాసన్ డ్యూర్లో ప్రేమలో పడినట్లు చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు.
ఇటీవల యుకె ఇంటర్యూలో లారా బింగిల్ మాట్లాడుతూ జాసన్ డ్యూర్లో ని ముద్దుగా బేబి అని పిలుస్తానని వివరించారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ లో కూడా లారా బింగిల్ చాలా సార్లు జాసన్ డ్యూర్లో ని బేబి అంటూ ఫోస్ట్ చేసినటువంటి సంఘటనులు విదితమే. లాస్ ఏంజిల్స్ లోని స్టూడియోలో జాసన్ డ్యూర్లో దిగినటువంటి ఓ అందమైన ఫోటోని లారా బింగిల్ తన ట్విట్టరో లో పోస్ట్ చేసింది.
లారా బింగిల్, జాసన్ డ్యూర్లో ని మొట్టమొదట సారిగా లాస్ వేగాస్ లో కలవడం జరిగింది. అప్పటి నుండి లారా బింగిల్ మరియు జాసన్ డ్యూర్లో ఇద్దరూ ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నట్లు కలసిమెలసి తిరుగుతున్నారు. లారా బింగిల్ గతంలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖెల్ క్లార్క్ గర్ల్ ప్రెండ్ గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవన విషయం కూడా తెలిసిందే.


Click it and Unblock the Notifications











