సీక్రెట్‌గా సింగర్‌తో డేటింగ్...!
హాలీవుడ్ పాప్ సింగర్స్‌లలో ఒకరైన రిహానా సడన్‌గా ఆస్టన్ కుచర్ కబ్బాలాహ్ గ్రూప్‌లో చేరడానికి గల కారణం వీరిద్దరూ గత డిసెంబర్ నుండి సీక్రెట్ గా డేటింగ్ చేస్తుండమేనని అంటున్నారు. డిసెంబర్‌లో ఓ స్నేహితుని పార్టీలో వీరిద్దరూ అసంబద్దంగా కలవడం.... ఆ తర్వాత మొబైల్ నెంబర్స్ తీసుకోవడం ద్వారా వీరి డేటింగ్ మొదలైనట్లు సమాచారం.
కానీ సింగర్ రిహానా మాత్రం ఆస్టన్ కుచర్ కబ్బాలాహ్ గ్రూప్‌లో చేరడానికి కారణం తాను త్వరలో లాస్ ఏంజిల్స్‌లో విడుదల చేయనున్న ఆల్బమ్‌కు ఇది ఉపయోగపడుతుందనే భావనతోనే చేరినట్లు తెలిపింది. కానీ వీరిని చూసిన వారు మాత్రం వయసులో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం సింగిల్ జీవించడమే కాకుండా.. ఇలా ఆల్బమ్ పేరుతో సీక్రెట్‌గా డేటింగ్ చేసుకోవడానికి వీలుంటుందనే ఉద్దేశ్యంతోనే కలిశారని అంటున్నారు.
ఆస్టన్ కుచర్ తన భార్య డెమి మోరి తనని మోసం చేశాడంటూ నవంబర్‌లో ఆస్టన్ కుచర్‌ని విడిపోయిన విషయం తెలిసిందే. ఇక రిహానా కూడా తన బాయ్ ప్రెండ్ క్రిస్ బ్రౌన్‌తో మనస్పర్దల వల్ల తెగతెంపులు చేసుకుంది.


Click it and Unblock the Notifications











