»   » హ్యాపీ న్యూస్: ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ పెళ్లి!

హ్యాపీ న్యూస్: ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ పెళ్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సీనియర్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ అభిమానులకు హ్యాపీ న్యూస్. త్వరలో ఈ కండల వీరుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. విదేశీ అమ్మాయితో తన జీవితాన్ని పంచుకోబోతున్నాడు. గత కొంతకాలంగా రొమేనియన్ మోడల్ లులియా వేంటర్‌తో డేటింగ్ చేస్తున్నసల్మాన్, త్వరలో ఆమెనే పెళ్లాడబోతున్నాడు.

ప్రముఖ జాతీయ మేగజైన్ ఇండియా టుడే నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్....ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఈ సంవత్సరం చివర్లో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. ఇకపై తన జీవితం మరింత సంతోషంగా సాగుతుందని భావిస్తున్నట్లు సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

తాను అన్ని మతాలను గౌరవిస్తాను. మతానికంటే మానవత్వానికి గౌరవమిస్తాను. మా కుటుంబం వివిధ మతాలు కలగలిపిన చక్కని కుటుంబం. మా నాన్న పఠాన్, తల్లి హిందు, చిన్నమ్మ క్యాథలిక్, బావ పంజాబీ....అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇలా చెప్పడం ద్వారా...పెళ్లి విషయంలో తనకు మతాన్నిపట్టించుకోనని చెప్పకనే చెప్పాడు సల్మాన్ ఖాన్.

Is Salman Khan Getting Married To Lulia Vantur?

గతంలో కూడా సల్మాన్ ఖాన్ లులియా వేంటర్‌ను పెళ్లాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ పత్రిక రొమేనియా భామతో సల్మాన్ పెళ్లి విషయమై తండ్రి సలీమ్‌ఖాన్‌ను ప్రశ్నించగా....'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆమెతో సల్మాన్ ఫెళ్లి వార్త కల్పితం మాత్రమే. వృత్తి రీత్యా సల్మాన్ ఖాన్ ఎంతో మందిని కలుస్తుంటారు. లులియా కూడా కూడా అలాంటి వ్యక్తుల్లో ఒకరు' అని వ్యాఖ్యానించారు.

కానీ ఎవరూ ఊహించని విధంగా సల్మాన్ ఇపుడు అదే అమ్మాయితో పెళ్లికి సిద్దం అవుతుండటం చర్చనీయాంశం అయింది. గతంలో సల్మాన్ ఖాన్ చాలా మంది హీరోయిన్లతో ఎపైర్లు నడిపించాడు. అప్పట్లో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినాను పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అనుకోని కారణాలతో వారి మధ్య బ్రేకప్ వచ్చింది.

English summary
At India Today Conclave 2014, Bollywood's most lovable brat Salman Khan revealed that he may get hitched soon, most probably with Romanian model, Lulia Vantur whom he has been allegedly dating for an year. He admits that he is tired of being single for a very long time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu