Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విడిపోయి రోజులు గడవక ముందే, డేటింగా?
హాలీవుడ్లో ఎప్పుడెప్పుడు ఎవరితో ఎవరు కలిసుంటారనేది అంతుబట్టని విషయం. స్కేర్ లెట్ జాన్సన్ తన భర్త రేయన్ రేనాల్డ్స్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత హాలీవుడ్ సూపర్ స్టార్ సీన్ పెన్‌తో చాలా రోజులు కలసి జీవించింది. ఐతే సడన్‌గా మరలా ఏమైందో తెలియదు గానీ ఈ జంట నెల రోజులు క్రితం విడిపోయింది. సాధారణంగా అబ్బాయి అమ్మాయితో విడిపోతే ఆ జ్ఞాపకాలను చాలా రోజుల వరకు మరిపోడు. అదే అమ్మాయి ఐతే వెంటనే ఆ జ్ఞాపకాలను చెరిపివేసి అతి తక్కువ సమయంలో మరో అబ్బాయిని చూసుకుంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే స్కేర్ లేట్ జాన్సన్ జీవితంలో జరిగింది.
సీన్ పెన్ నుండి విడిపోయి నెల రోజుల గడవక ముందే స్కేర్ లెట్ జాన్సన్ హ్యాంగోవర్ హీరో జస్టిన్ బార్తాతో కలిసి మాన్ హాట్టన్‌లో జరిగిన ప్లే ఆల్ న్యూ పీపుల్ అనే కార్యక్రమానికి అతనితో కలసివచ్చింది. అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఫోటలకు ఫోజలు ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ వీరిద్దరని చూసిన వారంతా ఒకరికొకరు బాగా ఎంకరేజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు. రాత్రి డిన్నర్లో 15 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి టేబుల్లో వీరిద్దరూ ప్రక్క ప్రక్కనే కూర్చోని డిన్నర్ చేస్తూ రాత్రి మొత్తం మాట్లాడుకోవడం జరిగిందని వారిని చూసిన ఒకతను తెలియజేశారు.
ఇద్దరూ కూడా ఏదో విషయం మీద సుధీర్గంగా చర్చించినట్లు సమాచారం. స్కేర్ లెట్ జాన్సన్ జూన్‌లో సీన్ పెన్ నుండి విడిపోవడం జరిగింది. ఇక హీరో జస్టిన్ బార్తా తన ప్రియురాలు ఆస్లే ఓల్సన్తో ఉన్న సంబంధం తెంచుకొని రెండు సంవత్సరాలు అయింది. ఇక వీరిద్దరి మద్య ఉన్న సంబంధం గురించి మాట్లాడడానికి స్కేర్ లెట్ జాన్సన్ నిరాకరించింది.