ఇండియన్ టెక్స్ టైల్ దిగ్గజం భార్య హానీమూన్ క్రికెటర్ షేన్ వార్న్‌తోనా..?
హాలీవుడ్ బికిని భామ ఎలిజబెత్ హార్లే విషయానికి వస్తే తన భర్త ఇండియన్ టెక్స్ టైల్ దిగ్గజం అరుణ్ నాయర్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో కోన్ని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ నిజం చేశారు మన బికిని భామ ఎలిజబెత్ హార్లే. ఎప్పుడు అని అనుకుంటున్నారా..ఫిబ్రవరి పద్నాలుగు వాలెంటైన్స్ డే కి వారం రోజులు ముందు మెల్ బోర్న్ వెల్లడం జరిగింది. ఈవారం రోజులు పాటు షేన్ వార్న్‌తోటి హానీమూన్ ట్రిప్పు లాగా ఎంజాయ్ చేశారని సమాచారం.
ఎలిజబెత్ హార్లే ఈవారం రోజులు షేన్ వార్న్‌తో గడిపి నిన్న రాత్రి లండన్‌కి రావడం జరిగిందని అంటున్నారు సన్నిహితులు. ఇది మాత్రమే కాకుండా తను మెల్ బోర్న్ నుండి తిరిగివచ్చిన తర్వాత షేన్ వార్న్‌తో పంచుకన్నటువంటి తన ప్రేమికుల రోజు అనుభవాలు ట్విట్టర్ ద్వారా తియ్యగా ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు అందరికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది మాత్రమేకాకుండా ప్రేమ అనేది బైకు మీద రైడ్‌కి వెళితే ఎలాగుంటుందో అలాంటిదన్నారు. ఒక్కోసారి చాలా ఆసక్తిగా ఉంటుంది మరోక సారి మన ఆరోగ్యం క్షీణించడానికి కూడా కారణం అవుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications











