నాలుగో పెళ్లికి స్టార్ హీరో సిద్దం .. ఆ హీరోయిన్‌తో డేటింగ్ అంటూ వార్తల జోరు!

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ మరోసారి మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టుగానే సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. ఇలాంటి పాజిటివ్ వార్తల మధ్య టామ్ క్రూజ్ అఫైర్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టామ్ క్రూజ్‌తో తన రిలేషన్‌పై హేలే ఎట్‌వెల్ ఘాటుగా స్పందించింది. హేలే ఎట్‌వెల్ చెప్పిన విషయాల్లోకి వెళితే..

మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీలో టామ్ క్రూజ్ నటించిన హేలే ఎట్‌వెల్ కూడా నటించారు. తాజాగా రిలీజైన ట్రైలర్లలో ఈ జంట మధ్య కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకొన్నది. అయితే టామ్ క్రూజ్‌తో హేలే ఎట్‌వెల్ రొమాన్స్ చేసున్నదనే వార్తలు వైరల్ అయ్యాయి. మీడియాలో అఫైర్ వార్తలు భారీగా రావడంతో హేలే ఎట్‌వెల్ మీడియాలో స్పందించారు.

Is Tom Cruise dating with Hayley Atwell amid Mission Impossible 7 Release?

టామ్ క్రూజ్, మిషన్ ఇంపాజిబుల్ మూవీ డైరెక్టర్ నాకు మంచి స్నేహం ఉంది. అలాంటి ఫ్రెండ్‌తో, నేను పనిచేసిన స్టార్‌తో నాకు సంబంధం అంటగట్టడం బాధగా ఉంది. ఇలాంటి రూమర్లను క్రియేట్ చేయడం సరికాదు. నా గురించి తెలిసి కూడా ఇలాంటి గాసిప్స్ ప్రచారం చేయడం సరికాదు అని హేలే ఎట్‌వెల్ చెప్పింది.

అఫైర్ వార్తల మధ్య నేను టామ్ క్రూజ్‌ను కలిశాను. అప్పుడు నీవేంటో నీకు తెలుసు. నేనేంటో నీకు తెలుసు. మన గురించి ఎవరేమనుకొన్నా పట్టించుకోవద్దు. మన గురించి ప్రజలు ఏమనుకొంటున్నారనే విషయం గురించి ఆలోచించకు. నీవు పాటించే విలువల గురించి ఆలోచించుకో అని టామ్ చెప్పారని హేలే ఎట్‌వెల్ అన్నారు.

హేలే ఎట్‌వెల్ కెరీర్, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. గత ఏప్రిల్‌లో మ్యూజిక్ కంపోజర్ నెడ్ వూల్ఫ్ గ్యాంగ్ కెల్లీతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలోనే హేలే ఎట్‌వెల్ వివాహం చేసుకోనున్నది. అలాంటి పరిస్థితుల మధ్య టామ్ క్రూజ్‌తో డేటింగ్ వ్యవహారం ఆమెను గందరగోళంలో పడేసింది. దాంతో క్లారిటీ ఇచ్చేందుకు ప్లాన్ చేసింది.

Is Tom Cruise dating with Hayley Atwell amid Mission Impossible 7 Release?

ఇక టామ్ క్రూజ్ విషయానికి వస్తే..గతంలో అనేక మంది సినీ ప్రముఖులతో అఫైర్ వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలను ఆయన కొట్టి పడేశారు. తాజాగా సింగర్ షకీరాతో సంబంధం ఉందనే వార్త వైరల్ అయింది. 61 సంవత్సరాల టామ్ క్రూజ్‌కు గతంలో మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి.

టామ్ క్రూజ్ పెళ్లిళ్ల విషయానికి వస్తే.. 1987లో మిమి రోజర్స్‌ను వివాహం చేసుకొన్నారు. వారిద్దరు 1990లో విడిపోయారు. ఆ తర్వాత నటి నికోల్ కిడ్మన్‌ను 1990లో పెళ్లి చేసుకొన్నాడు. వారిద్దరి 2001 వరకు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. ఆతర్వాత నటి కేటీ హోమ్స్‌ను 2006లో వివాహం చేసుకొని 2012 విడిపోయారు. ప్రస్తుతం ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X