అకాడమీ ఆఫ్ ద ఎంటర్టైనర్ అవార్డు ఆమెకే..
దేశీ మ్యూజిక్ అవార్డ్స్ విభాగంలో అకాడమీ ఆఫ్ ద ఎంటర్టైనర్ అవార్డుని అందుకున్న హాలీవుడ్ ప్రముఖ సింగర్ టేలర్ షిప్ట్ ఈ ఆనందాన్ని కుటుంబం మరియు స్నేహితులతో జరుపుకుంది. ఇటీవలే టేలర్ షిప్ట్ జపాన్‌లో యల్లోటెయిల్ హోటల్, లాస్ వేగాస్‌లో బెల్లాగియో హోటల్స్‌ని సందర్శించి తునా పిజ్జా, కోబ్ బీఫ్ తాతకి వంటకాలను ఆస్వాదించారు.
గాయని టేలర్ స్విఫ్ట్, నటుడు టేలర్ లూట్నర్ ల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని హాలీవుడ్ లో ఎన్నో రోజుల నుండీ వినిపిస్తోంది. ఈ రూమర్స్ ఎలా ఉన్నాయంటే టేలర్ షిఫ్ట్ తన జీవితంలో ఒక్కసారిగా కలవని వ్యక్తులతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్‌ని టేలర్ షిఫ్ట్ ఖండించారు. ఇక వివరాల్లోకి వెళితే 22 సంవత్సరాల వయసు కలిగిన టేలర్ షిఫ్ట్ ఇంత వరకు తన జీవితంలో కలుసుకోని నటులు జాక్ ఎఫ్రాన్ మరియు ఎడ్డీ రెడ్ మాన్యేలతో కలసి డేటింగ్ చేస్తుందంటూ వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.
ఈ సందర్బంలో టేలర్ షిఫ్ట్ మాట్లాడుతూ ఇలాంటి రూమర్స్ అన్ని వినేందుకు నాకు చాలా ఫన్నీగా ఉన్నాయని అన్నారు. డేటింగ్‌లో మీరు చెప్పిన వారితో నేనింత వరకు కలవనే కలవలేదు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గా జీవిస్తున్నప్పటికీ.. చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. గతంలో ఇలానే టేలర్ స్విఫ్ట్, నటుడు టేలర్ లూట్నర్ ల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని హాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఖండించారు.


Click it and Unblock the Notifications











