ఫోటోలు : ఇన్నాళ్లు చాటుగా రాసలీలలు, ఇక పెళ్లికి రెడీ!
లాస్ ఏంజిల్స్ : టెన్నిస్టార్ అన్నా కోర్నికోవాతో అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ ఎన్రిక్ ఈగ్లెసీస్ 13 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ప్రేమ పక్షుల్లా స్వేచ్ఛగా విహరిస్తూ, చాటు మాటుగా రాసలీలల్లో మునిగి తేలిన ఈ జంట త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారు.
ఓ ఇంటర్నేషనల్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం వీరి వివాహం వచ్చే వారం వారి సొంత పట్టణమైన అమెరికాలోని మియామీలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వివాహ మహోత్సవానికి హాలీవుడ్, టెన్నిస్, ఇంటర్నేషనల్ సంగీత ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కొన్నేళ్లుగా అన్నా పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెస్తోంది. కానీ అతను ఒప్పుకోవడం లేదు. అతను ఇంకా లైఫ్‌లో సెట్ కాక పోవడం వల్లనే పెళ్లికి ఇష్ట పడలేదు. ఏది ఏమైతేనేం ఎట్టకేలకు వీరి పెళ్లికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే నికోలస్ స్వార్జ్ నెగ్గర్, లేవిస్ హామిల్టన్, జెన్నిఫర్ లోపెజ్, ఇవా లంగోరియా, డేవిడ్, విక్టోరియా బెక్‌హమ్ లాంటి వారికి ఆహ్వానం పంపినట్లు సమాచారం.
కోర్నికోవా కొన్ని సంవత్సరాలుగా 3 మిలియన్ పౌండ్ల విలువ చేసే డైమండ్ ఎంగేజ్‌మెంట్ ధరిస్తోంది. దీంతో 2011లోనే వీరి వివాహం సీక్రెట్‌గా జరిగిందనే పుకార్లు వినిపించాయి. అయితే ఆ వార్తలను వారు చాలా సందర్భాల్లో ఖండించారు. తాము త్వరలోనే గ్రాండ్‌గా వివాహం చేసుకుంటామని ప్రకటించారు.

గతంలో ఎన్రిక్ ప్లేబాయ్ మోడల్ సమంత టోర్రెస్‌తో 1997లో డేటింగ్ చేసాడు. ఆ తర్వాత అతను పలువురు ఇతర లేడీ సెలబ్రిటీలతో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత అన్నా కోర్నికోవాతో ప్రేమాయణంలోకి దిగాడు. ఈ జంట చాలా సందర్భాల్లో బహిరంగంగా రాసలీలలు జరుపుతూ కెమెరాలకు చిక్కారు.

పబ్బులూ, నైట్ క్లబ్బుల్లో వీరు తరచూ కనిపిస్తుండటంతో వీరి రిలేషన్ బట్టబయలైంది.

ఆ తర్వాత అభిమానులకు తమ రిలేషన్ విషయాన్ని వెల్లడించి, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో ప్రియురాలితో కలిసి ఎన్రిక్


Click it and Unblock the Notifications











