ఫైటింగ్ సీన్స్ చాలా రిస్క్ అనిపించాయి: స్టార్ హీరోయిన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్ ఇటీవల నటించిన 'ది అవెంజర్స్' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ షూటింగ్ చాలా కష్టమనిపించిందని అన్నారు. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ రోజులు షూట్ చేయడంతో బహుశ నాకు ఇలా అనిపించి ఉండవచ్చునని అన్నారు. మొదటి రోజు కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. రెండవ రోజు నుండి చాలా ఛాలెంజింగ్ తీసుకోని ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ లో నటించానని అన్నారు.
స్టంట్ ప్రతిసారీ విఫలం అవుతుంటే మొదట్లో బాధ అనిపించినప్పటికీ.. అదే స్టంట్‌ని ఖచ్చితంగా చేస్తే వచ్చే ఆనందం చెప్పలేదని అన్నారు. 'ది అవెంజర్స్' సినిమాలో స్కేర్ లెట్ జాన్సన్ సూపర్ హీరో మహిళా పాత్ర(బ్లాక్ విడో)ని పోషిస్తున్నారు. ఈ పాత్రని ఓ ఛాలెంజ్‌గా తీసుకోని చేస్తున్నానని.. ఈ పాత్ర చేయడంతో రాబోయే కాలంలో ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే అనుభవాన్ని సంపాదించానని జాన్సన్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని మే 4వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని స్టాన్ లీ, జాక్ కిర్బీ వ్రాసిన నవల 'ది అవెంజర్స్' ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు జాస్ వెడాన్ దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ, క్రిస్ ఎవాన్స్, మార్క్ రుఫ్పెలో, క్రిస్ హెమ్స్ వర్త్, జెరెమీ రేన్నెర్, సామ్యుఎల్ జాక్సన్ తదితరులు ముఖ్య తారాగణం.


Click it and Unblock the Notifications











