సెక్స్ సినిమాలకి ఇది తలమానికంగా నిలుస్తుంది: దర్శకుడు రికార్డో
రోమ్: ఇటలీ దేశంలో 'నికోలే మినెట్టి' ఈ పేరు తెలియని వారు ఉండరు. కారణం ఓ మాజీ షో గర్ల్ నుండి ఇటలీ దేశంలో ఓ పెద్ద పోలిటీషియన్‌గా మారడమే. పోలిటీషియన్‌గా మారిన తర్వాత 'నికోలే మినెట్టి' పెద్ద ఎత్తున ఆరోపణలను ఎదుర్కొంది. ఇటలీ దేశానికి ప్రధానిగా సిల్వియో బెర్లుస్కోనీ ఉన్న సమయంలో ఆయన పార్టీ సభ్యులు ఏర్పాటు చేసిన శృంగార ఫంక్షన్లకు 'నికోలే మినెట్టి' వేశ్యలను సేకరించిందని ఆమె ఎదుర్కొన్న అతి పెద్ద ఆరోపణ.
ఇప్పుడు నికోలే మినెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. ఆ కొత్త జీవితం ఏమిటంటే శృంగార నటన. వచ్చే నెలలో ప్రారంభం కానున్న "inside a luxurious apartment" అనే సెక్స్ సినిమాలో నటించడానికి నికోలే మినెట్టి అంగీకరించిందని సమాచారం. ఈ సినిమాకి ఫేమస్ ఇటాలియన్ శృంగార సినిమాల దర్శకుడు రికార్డో సియాచి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్బంలో రికార్డో సియాచి మాట్లాడుతూ సెక్స్ సినిమాల చరిత్రలో ఈ సినిమా పెద్ద చరిత్రను సృష్టిస్తుంది.. అంతేకాదు నా జీవితంలో నేను తీయనున్న చివరి సినిమా ఇది అని అన్నారు.
ఈ సినిమాలో నికోలే మినెట్టి సరసన 'కింగ్ ఆఫ్ పాప్' బిరుదాంకితుడు మైఖెల్ జాక్సన్ లాయర్ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











