twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనుష్యులపై కసి తీర్చుకునే కథతో... 'జాక్‌ ది జెయింట్‌ స్లేయర్‌'

    By Srikanya
    |

    లండన్ : హాలీవుడ్ చిత్రాలంటే అందరికీ ఆసక్తే. పరిమితి బడ్జెట్ తో, భారీ యాక్షన్,ఫాంటసీలతో రూపొందే చిత్రాలంటే మరీనూ. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ 'జాక్‌ ది జెయింట్‌ స్లేయర్‌' పైనే ఉంది. బ్రయాన్‌ సింగర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఫాంటసీ. ఆకాశాన్ని తాకినట్టుండే రాకాసి చెట్లు... కొండల్లా కనిపించే మనుషులు... ఆ ప్రాంతమంతా ఓ మాయాలోకాన్ని తలపిస్తోంది. భయంకరమైన గ్రహాంతర వాసులు... మనషులు కనిపిస్తే చాలు కసి తీర్చుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో జాక్‌ అనే ఓ యువకుడు ఎలాంటి సాహసానికి పూనుకొన్నాడు? శత్రువులపై ఏ రకమైన పోరాటం సాగించాడు? తదితర విషయాలు తెలియాలంటే 'జాక్‌ ది జెయింట్‌ స్లేయర్‌' చూడాల్సిందే అంటున్నారు. ఈ చిత్రం తెలుగులో ఫాంటసీ,యాక్షన్ చిత్రాలు చూసే వారకి బాగా నచ్చుతుందని చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మీగణపతి ఫిలింస్‌ అందిస్తున్నారు. 'విచిత్ర దీవి' తర్వాత ఈ సంస్ధ నుంచి వస్తున్న తాజా 3డి చిత్రం 'వింత ప్రపంచం'. హాలీవుడ్‌ ఫాంటసీ యాక్షన్‌ చిత్రం 'జాక్‌ ది జెయింట్‌ స్లేవర్‌'కి అనువాద రూపమిది. నికోలస్‌ హాల్ట్‌, ఎలీనర్‌ టోమ్‌లిన్‌సన్‌, స్టాన్లీ టుక్కి, ఇయాన్‌ మెక్‌ షేన్‌ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

    ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న నిర్మాత సుబ్రమణ్యం.బి మాట్లాడుతూ ''చందమామ కథలాంటి సినిమా ఇది. భూలోకంలో ఉన్న ఓ అందమైన రాకుమారిని బంధించి... ఆమెనీ, ఆమె రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకొన్న గ్రహాంతర వాసులపై ఓ యువకుడు సాగించే పోరాటంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్రీడీలో రూపొందిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకొనేలా ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేస్తాము''అన్నారు.

    అలాగే...''2012లో 'విచిత్ర దీవి (జర్నీ 2) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ కోవలోనే రెట్టింపు విజయం సాధించే చిత్రమిది. మా సంస్థనుంచి ఐమాక్స్‌ 3డిలో వస్తున్న 5వ సినిమా ఇది. హిందీ, ఇంగ్లీష్‌, తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం. భూమిని, భూమ్మీది రాకుమారిని తమ వశం చేసుకోవాలని దాడికి దిగిన వింత రాక్షస గ్రహాంతరవాసులను ఓ సాహసికుడు ఎలా ఎదిరించాడు? చివరికి భూమిని, రాకుమారిని ఎలా రక్షించుకున్నాడు? అనేదే కథాంశం. విజువల్‌ వండర్‌ ఈ చిత్రం. ఊపిరి తీసుకోనివ్వని యాక్షన్‌ ఉత్కంఠకి లోను చేస్తుంది. గ్రహాంతర వాసులతో మానవుల పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది. కొండంత మనుషులు, ఆకాశంలోకి దూసుకెళ్లే భారీ చెట్టు వెరైటీ అనిపిస్తాయి. ఇదో చిన్న అవతార్‌. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది. ఎక్స్‌-మేన్‌ దర్శకుడు బ్రియాన్‌ సింగర్‌ ప్రతిభావంతంగా సినిమాని తెరకెక్కించారు. అత్యధిక ప్రింట్లతో మార్చి 1న రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: సుబ్రహ్మణ్యం.బి, సురేష్‌.యస్.

    English summary
    Bryan Singer’s fairy tale re-telling Jack the Giant Killer made our original list for Most Anticipated Movies of 2013, thanks in part to the involvement of the X-Men director – not to mention, a fun teaser trailer hinting at an action-packed fantasy adventure boasting a solid cast headed by Nicholas Hoult (A Single Man, X-Men: First Class). However, when David Dobkin’s Arthur & Lancelot hit a snag during pre-production, Warner Bros. decided to push Jack back to March 2013 (to replace Arthur as the studio’s big release that month). Warner Bros. is expected to re-initiate the marketing for Singer’s film in the near future, possibly attaching a new trailer with The Hobbit: An Unexpected Journey this December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X