నా కుమారుడినే విసిరి కొట్టా, మద్యానికి బానిసై నీచంగా.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!
మార్షల్ ఆర్ట్స్ కింగ్, స్టార్ హీరో జాకీచాన్ ఆటోబయోగ్రఫీ పుస్తకం ఇంగ్లీషులో విడుదలయింది. జాకీచాన్ తన జీవితంలోని కీలక అంశాలని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. 2015 లోనే జాకీ చాన్ ఈ పుస్తకాన్ని చైనీస్ లో విడుదల చేశారు. తాజాగా జాకీచాన్ జీవిత చరిత్ర ఆంగ్లంలో 'నెవర్ గ్రో అప్' పేరుతో ప్రచురితమైంది. జాకీ చాన్ ఈ పుస్తకంలో వ్యక్తిగత విషయాలని దాచుకోకుండా ప్రస్తావించారు. తన కుటుంబ సభ్యులతో ఎలా ఉండే వాడినో జాకీ చాన్ వివరించారు. ఆ ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం.

మార్షల్ ఆర్ట్స్ కింగ్
ఆసియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటులలో జాకీ చాన్ ఒకరు. మార్షల్ ఆర్ట్స్ లో జాకీ చాన్ కు తిరుగులేని ప్రావీణ్యం ఉంది. అబ్బురపరిచే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకోవడం జాకీ చాన్ ప్రత్యేకత. ఎంతటి సాహసాన్ని అయినా ఆయన అవలోగా చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే వేడి తెరపై నటించే రియల్ హీరో జాకీ చాన్. కానీ తనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని జాకీ చాన్ నిజాయతీగా తన ఆటో బయోగ్రాఫ్ లో పేర్కొన్నారు.

రాత్రంతా తాగుతూనే
తాను ఓ దశలో మద్యానికి తీవ్రంగా బానిసగా మారానని జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ తన ఆటో బయోగ్రఫీలో పేర్కొన్న దాని ప్రకారం.. నేను రాత్రంతా తాగుతూనే ఉండేవాడిని. ఉదయానికల్లా నా కారు ఏ చెట్టుకో, గోడకో యాక్సిడెంట్ అయి ఉండేది. అలా ఎన్నిసార్లు జరిగిందో లెక్కలేదు. ఆ తరువాత మధ్యపానంతో జీవితం నాశనం కాకుండా పోరాటం చేసానని జాకీ చాన్ పేర్కొన్నారు.

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తరువాతే
తాను మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన తరువాతే మద్యానికి అలవాటు పడ్డట్లు జాకీ చాన్ రాసుకొచ్చారు. మద్యానికి బానిస కావడంతో కెరీర్ పై ఒక్కోసారి దిగులు పడేవాడిని. ఆక్రోశం, ఆవేశం తారాస్థాయికి చేరేవి అని జాకీచాన్ పేర్కొన్నారు. మానసిక సంఘర్షణకు కూడా లోనైనట్లు జాకీ చాన్ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో ఎలా ఉండే వాడినో జాకీ చాన్ వివరించారు.

కోపాన్ని నా కొడుకుపై
తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నానో నాకే అర్థం అయ్యేది కాదు. కొన్ని దార్లు నా ఆవేశాన్ని కొడుకుపై చూపించే వాడిని. ఓ సారి గిర్రున తిప్పి విసిరి కొట్టా. అదృష్టం కొద్దీ సోఫాలో పడ్డాడు. లేకుంటే పెద్ద గాయమే అయ్యేది అని జాకీ చాన్ తెలిపాడు. ఇలాంటి చర్యలని తలచుకుని చాలా బాధపడే వాడిని అని జాకీ చాన్ తెలిపారు.

నేను చేసిన అపరాధం
నా జీవితం మొత్తంలో తాను అపరాధంగా భావించేది మద్యానికి బానిసగా ఉన్న పీరియడ్ అని అన్నారు. ఆ తరువాత నెమ్మదిగా మద్యపానం అలవాటుని వదిలించుకున్నానని జాకీ చాన్ తెలిపారు. ఆసియాలో టాప్ స్టార్ గా ఉన్నా జాకీ చాన్ ఎన్నో అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. హాలీవుడ్ లో కూడా జాకీ చాన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది.


Click it and Unblock the Notifications











