యాక్షన్ హీరో జాకీ ఛాన్ హార్ట్ స్ట్ర్రోక్ తో మరణం?
ప్రపంచ ప్రసిద్దిగాంచిన హాంగ్ కాంగ్ యాక్షన్ హీరో జాకీ ఛాన్ మరణించాడంటూ అంతటా వార్తలు వస్తున్నాయి.అయితే ఇది రూమర్ అని మరో ప్రక్క ప్రచారం జరుగుతోంది. గూగుల్ ఈ న్యూస్ కోసం విపరీతమైన సెర్చ్ జరుగుతోందని ప్రపంచ మీడియా సంస్ధలు తెలుపుతున్నాయి. 57 సంవత్సరాల వయస్సు ఉన్న జాకీ ఛాన్ లాస్ ఏంజిల్స్ లోని ఓ హాస్పటల్ లో మరణించాడంటూ వార్త వచ్చింది.స్ట్రెస్ ఎక్కువై హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఆ న్యూస్ లో ఉంది.అయితే ఇది కొందరు వ్యక్తుల కావాలనే పుట్టించని రూమర్ అని ఆయన క్షేమంగానే ఉన్నాడని,భయపడాల్సిన పనిలేదని ఆయన ఫాన్ సైట్ తెలుపుతోంది.ప్రస్తుతం జాకీఛాన్ తన తాజా చిత్రం కుంగుఫూ పాండా 2 ప్రమేషన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అలాగే ఆయన వందవ చిత్రం 1911 (టైటిల్) షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు.ఏప్రియల్ ఒకటవ తేదీ మరో రెండు రోజుల్లో వస్తూండగా కావాలనే జనాల్ని ముందుగా ఏప్రియల్ ఫూల్ చేయటానకి ఇది కల్పించిన రూమర్ అని అంటున్నారు. ఇక ఇదంతా రూమర్ కావాలని, ఆయన క్షేమంగా ఉండాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











