twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాకీ ఛాన్ కు అస్కార్: మీరు ఇన్నాళ్లూ చూడని జాకీ పొటోలతో విశేషాలు

    By Srikanya
    |

    లాస్‌ ఏంజెల్స్‌: ఎట్టకేలకు ప్రముఖ యాక్షన్‌ హీరో జాకీచాన్‌కు గౌరవ ఆస్కార్‌ పురస్కారం లభించింది. లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన వార్షిక గవర్నర్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

    ప్రపంచ సినిమాకు ఆయన చేస్తున్న సేవలకు, ఆయన సాధించిన విజయాలకు గాను గౌరవ ఆస్కార్ ను అందించాలని ఆస్కార్ జ్యూరీ నిర్ణయించింది. జాకీతో పాటు ఎడిటర్ అన్నేకోట్స్, కాస్టింగ్ డైరెక్టర్ లెన్ స్టేల్మాస్టర్, డాక్యుమెంటరీ దర్శకుడు ఫ్రెడ్రిక్ వైజ్ మన్ లను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

    హాంకాంగ్‌లో పుట్టిన జాకీచాన్‌ ఎనిమిదేళ్ల వయసులో నటనా రంగంలో అడుగుపెట్టి ముప్పైకి పైగా మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రధాన చిత్రాల్లో నటించాడు. . అయితే ఇప్పటివరకు ఆయన ఆస్కార్‌ పురస్కారం అందుకోలేదు. ఆగస్ట్‌లో అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీల జాబితాలో జాకీ చాన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

    1978 లో స్నేక్ ఇన్ ద ఈగల్ షాడో చిత్రంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన జాకీ, 1980 లో ది బిగ్ బ్రాల్ అనే హాలీవుడ్ చిత్రంతో యూఎస్ భాక్సాఫీస్ నిశాసించాడు. అక్రోబాటిక్ ఫైటింగ్ సైయిల్, కామెడీ స్టంట్స్, అధునాతన ఆయుధాలతో సినిమాలను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయటంలో జాకీ చాన్ దిట్ట.

    కాగా ఇప్పటివరకూ ముప్పై కి పైగా మార్షిల్ ఆర్ట్స్ చిత్రంలో నటించిన ఘనత సైతం జాకీఛాన్ దే కావటం విశేషం. దాదాపు 56 సంవత్సరాల సినీ జీవితంలో జాకీచాన్‌ దాదాపు 200 సినిమాల్లో నటించారు.

    గర్విస్తున్నా..

    ఈ సందర్భంగా చైనీయుడిగా ఉండటానికి గర్విస్తున్నానని చెప్పిన జాకీ చాన్‌.. తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. తన అభిమానల కోసం సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఎప్పటిలాగే స్టంట్స్‌ చేస్తానని చెప్పుకొచ్చాడు.

    ఈ కార్యక్రమంలో..

    ఈ కార్యక్రమంలో..

    ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎడిటర్‌ అన్నే.వి.కోట్స్‌, కాస్టింగ్‌ డెరెక్టర్‌ లిన్‌ స్టాల్‌మాస్టర్‌, ప్రెడ్రిక్‌ వైస్‌మెన్‌లకు కూడా గౌరవ పురస్కారాలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్‌ ప్రముఖులు ఎమ్మాస్టోన్‌, నికోల్‌ కిడ్‌మన్‌, దేవ్‌పటేల్‌ తదితరుల హాజరయ్యారు.

    ఎమేజింగ్ అంటూ

    ఎమేజింగ్ అంటూ...

    మన విలన్ ఏమంటాడంటే..

    ఈ విషయమై బాలీవుడ్ నటుడు,తెలుగు సినిమాల విలన్ సోనూసూద్ వెంటనే ఇలా ట్విట్టర్ ద్వారా స్పందించారు. జాకీఛాన్ కు శుభాకాంక్షలు తెలియచేసారు.

    ఫెంటాస్టిక్ అంటూ...

    జాకీఛాన్ తో కలిసి చిత్రాలు చేసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఈ క్రింద విధంగా ఈ సందర్బంగా ట్వీట్ చేసి, శుభాకాంక్షలు తెలియచేసారు.

    ఆయన ముద్దు పేరు ఇది

    ఆయన ముద్దు పేరు ఇది

    చిన్నప్పుడే జాకీ ఛాన్ చాలా శక్తివంతుడైన పిల్లవాగా పేరొందాడు. జాకీచాన్‌ శక్తిసామర్థ్యాలకు ముగ్ధులైన వారంతా ఆ బాలుడిని ముద్దుగా 'పావోపావో' (ఫిరంగి గుండు) అని పిలిచేవారు. ఆయన తల్లిదండ్రులు హాంకాంగ్‌ లోని ఫ్రెంచ్‌ దౌత్య కార్యా లయంలో పని చేసే వారు.

    వలస వెళ్లి కుక్ గా చేరి

    వలస వెళ్లి కుక్ గా చేరి

    చిన్నప్పుడు చదువులో అంతగా రాణించక పోవ డంతో తల్లి దండ్రులు బడి మాన్పించేశారు. 1960 లో తండ్రి ఆస్ట్రేలియా లోని కాన్ బెర్రాకు వలస వెళ్ళాడు. అక్కడ ఆయన అమెరికన్‌ ఎంబసీలో హెడ్‌కుక్‌గా చేరారు.

    త్రీ బ్రదర్స్

    త్రీ బ్రదర్స్

    ఆస్ట్రేలియాలో ఉండగా జాకీచాన్‌ను చైనా డ్రామా అకాడమీలో చేర్చారు. అక్కడే ఆయన ఓ పదేళ్ళపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో, ఆక్రోబాటిక్స్‌లో కఠోరశిక్షణ పొందాడు. ఆ సమయంలోనే ఆయనకు సామో హంగ్‌, యెన్‌ బియావోలతో స్నేహం ఏర్పడింది. వీరి ముగ్గురినీ త్రీ బ్రదర్స్‌ అని, త్రీ డ్రాగన్స్‌ అనీ పిలిచేవారు.

    సినీ కెరీర్ మొదలు

    సినీ కెరీర్ మొదలు

    ఎనిమిదేళ్ళ వయస్సులోనే జాకీచాన్‌ 'బిగ్‌ అండ్‌ లిటిల్‌ వాంగ్‌ టిన్‌ బార్‌' (1962)లో నటించాడు. అలా ఆయన సినిమా కేరీర్‌ ప్రారంభమైంది. 17 ఏళ్ళవయస్సులో బ్రూస్‌లీ సినిమాల్లో స్టంట్‌మాన్‌గా నటించాడు. ఆ తరువాత 'లిటిల్‌ టైగర్‌ కాంటన్‌' లో ప్రముఖ పాత్ర లభించింది.

    ఆ సినిమాలో స్టంట్స్ ఉండవు

    ఆ సినిమాలో స్టంట్స్ ఉండవు

    1973లో 'లిటిల్‌ టైగర్‌ కాంటన్‌' హాంకాంగ్‌ ప్రాంతంలో మాత్రమే విడుదలైంది. మొదట్లో నటించిన సినిమాలు ఫెయిల్‌ కావడం, స్టంట్‌ పనులు దొరకడం కష్టం కావడంతో 1975లో జాకీచాన్‌ పెద్దలకు మాత్రమే అనదగ్గ 'ఆల్‌ ఇన్‌ ది ఫ్యామిలీ' సినిమాలో నటించాడు. జాకీచాన్‌ నటించిన వాటిల్లో ఒక్క ఫైట్‌ లేదా స్టంట్‌ సీన్‌ లేని చిత్రం అదొక్కటే కావడం విశేషం.

    కూలిగానూ చేసాడు

    కూలిగానూ చేసాడు

    1976లో జాకీచాన్‌ కాన్‌బెర్రాలో తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. అక్కడ భవన నిర్మాణ కూలీగా కూడా పనిచేశాడు. అక్కడ తోటి వారు ఆయనను లిటిల్‌ జాక్‌గా పిలిచేవారు. అదే క్రమంగా జాకీగా మారి ఆయన పేరు జాకీచాన్‌గా మారి పోయింది. 1990 ప్రాంతంలో జాకీ చాన్‌ తన తండ్రి ఇంటిపేరు మీదుగా తన చైనీస్‌ పేరును ఫాంగ్‌ సి లుంగ్‌ గా మార్చుకున్నాడు.

    ఈ సినిమాతోనే పేరు

    ఈ సినిమాతోనే పేరు

    1978లో జాకీచాన్‌ నటించి స్నేక్‌ ఇన్‌ ది ఈగిల్స్‌ షాడో సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో కామెడీ అందరికీ నచ్చింది. ఆ తరువాత వచ్చిన డ్రంకెన్‌ మాస్టర్‌తో సినిమాల్లో తన స్థానాన్ని జాకీచాన్‌ మరింత సుస్థిరం చేసుకోగలిగాడు. హాఫ్‌ ఎ లోఫ్‌ ఆఫ్‌ కుంగ్‌ ఫు, స్పిరిట్యువల్‌ కుంగ్‌ ఫు మంచి పేరు తెచ్చాయి. దర్శకుడు లో వీ ఇచ్చిన స్వేచ్ఛను ఆయన సద్వినియోగం చేసుకోగలిగాడు.

    డైరక్టర్ తో ఒప్పందం రద్దు

    డైరక్టర్ తో ఒప్పందం రద్దు

    దీంతో ఫియర్‌లెస్‌ హైనా సినిమా సహదర్శకత్వం వహించే అవకాశం కూడా లభించింది. ఆ దర్శకుడితో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించిన జాకీచాన్‌ గోల్డెన్‌ హార్వెస్ట్‌లో చేరాడు. దాంతో ఇద్దరి మధ్యా వివాదం తలెత్తింది. సహనటుడు, దర్శకుడు జిమ్మీ వాంగ్‌ యు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జాకీ చాన్‌ గోల్డెన్‌ హార్వెస్ట్‌ కంపెనీతో అనుబంధాన్ని కొనసాగించాడు.

    బ్రద్దలైన రికార్డ్ లు

    బ్రద్దలైన రికార్డ్ లు

    హాంకాంగ్‌ సినిమా రంగంలో ... యంగ్‌ మాస్టర్‌ (1980), డ్రాగన్‌ లార్డ్‌ (1982) సినిమాలు జాకీచాన్‌కు మంచిపేరు తెచ్చాయి. యంగ్‌మాస్టర్‌ అప్పట్లో బ్రూస్‌లీ నెలకొల్పిన బాక్స్‌ ఆఫీస్‌ రికార్డులు బద్దలుగొట్టింది. హాంకాంగ్‌ సినిమా రంగంలో జాకీ చాన్‌ను టాప్‌ స్టార్‌గా నిలబెట్టింది.

    ఫైట్ సీన్ కోసం అంత కష్టం

    ఫైట్ సీన్ కోసం అంత కష్టం

    డ్రాగన్‌లార్డ్‌ సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు జాకీచాన్‌. అందులో పిరమిడ్‌ పైట్‌ సీన్‌ సింగిల్‌ సాట్‌కు 2900 టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది.

    ప్రెండ్స్ తో కలిసి ప్రమాదం..

    ప్రెండ్స్ తో కలిసి ప్రమాదం..

    తన చిన్ననాటి స్నేహితులు సమో హంగ్‌, యెన్‌ బియావోలతో కలసి జాకీ చాన్‌ ఎన్నో యాక్షన్‌ కామెడీ సినిమాలు చేశాడు. ఈ ముగ్గురూ కలిసి తొలిసారిగా 1983లో ప్రాజెక్టు ఎ అనే సినిమాలో నటించారు. ప్రమాదభరిత స్టంట్స్‌ ఎన్నో ఇందులో ఉన్నాయి. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా లభించాయి. ఆ తరువాత వీరు ముగ్గురూ కలసి వీల్స్‌ ఆన్‌ మీల్స్‌, ది ఒరిజినల్‌ లక్కీ స్టార్స్‌ సినిమాల్లో నటించారు. 1988లో వీరంతా కలసి డ్రాగన్స్‌ ఫరెవర్‌ సినిమాలో నటించారు. అదే వారంతా కలసి నటించిన చివరి సినిమా.

    సీక్వెల్స్ తో వరస విజయాలు

    సీక్వెల్స్ తో వరస విజయాలు

    1985లో జాకీచాన్‌ పోలీస్‌ స్టోరి సినిమా తీశారు. ఈ యాక్షన్‌ కామెడీ సినిమాలో ఆయన పలు ప్రమాదకర స్టంట్స్‌ చేయడం విశేషం. దానికి సీక్వెల్స్‌ కూడా వచ్చాయి. ఆర్మూర్‌ ఆఫ్‌ గాడ్‌ సినిమా హాంకాంగ్‌లో బాగా హిట్‌ అయ్యింది. 1990లలో జాకీ చాన్‌ మరో విడత హాలీవుడ్‌ ప్రవేశం కోసం చూసినా, వచ్చిన విలన్‌ పాత్రల అవకాశాలను తోసి పుచ్చారు. సిల్విస్టర్‌ స్టాలోన్‌ తన డిమాలిషన్‌ మ్యాన్‌ సినిమాలో ఈ విలన్‌ అవకాశాన్ని ఆఫర్‌ చేశారు.

    రాణించటం కష్టమైంది

    రాణించటం కష్టమైంది

    క్రమంగా జాకీచాన్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. జాకీ స్నేహితుడు చాన్‌ ఆయనకు పర్సనల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తూ అంతర్జాతీయ అవకాశాలు లభించేలా చేశారు. సుమారు 30 ఏళ్ళ పాటు ఆయన జాకీ చాన్‌కు పర్సనల్‌ మేనేజర్‌గా వ్యవహ రించారు. జాకీచాన్‌ తొలిసారిగా 1980లో హాలీవుడ్‌ సినిమా బాటిల్‌ క్రీక్‌ బ్రాల్‌లో నటించాడు. 1981లో కెనాన్‌ బాల్‌ రన్‌లో కూడా చిన్న పాత్ర పోషించాడు. ఆ రెండూ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆ తరువాత 1985లో వచ్చినది ప్రొటెక్టర్‌ అంతగా విజయం సాధించకపోవడంతో జాకీచాన్‌ తిరిగి హాంకాంగ్‌ సినిమా రంగంపై దృష్టి సారించాడు.

    మరోసారి జాకీ...

    మరోసారి జాకీ...

    మరోసారి హాలీవుడ్‌లో...1995లో జాకీచాన్‌ మరోసారి హలీవుడ్‌ చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని విజయం సాధించాడు. 'రంబెల్‌ ఇన్‌ ది బ్రోంక్స్‌' సినిమా ఘనవిజయం పొందింది. హాంకాంగ్‌ తారలెవరకూ అప్పటి వరకూ అలాంటి ఘనవిజయాన్ని హాలీవుడ్‌లో పొందలేకపోయారు. ఆ తరువాత ఆ స్ఫూర్తితో 'పోలీస్‌ స్టోరి-3, ''సూపర్‌''కాప్‌' రూపుదిద్దు కున్నాయి.

    హూ యాఐ నుంచీ

    హూ యాఐ నుంచీ

    ఆ తరువాత వచ్చిన 'రష్‌ అవర్‌' యాక్షన్‌ కామోడీ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. 1998లో ఆయన గోల్డెన్‌ హార్వెస్ట్‌ సంస్థకు చివరిసారిగా 'హు యామ్‌ ఐ'సినిమాలో నటించాడు. ఆ తరువాత కూడా పలు హాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించాడు. అవేవీ ఆయనకు అంత సంతృప్తిని ఇవ్వలేక పోయాయి. తన పాత్ర చిన్నది కావడం, తన ప్రమేయం అంతగా లేకపోవడం ఆయనను బాధించాయి.

    వరస హిట్స్

    వరస హిట్స్

    2003లో ఆయనే సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను నెలకొ ల్పారు. దాని నుంచి తీసిన 'న్యూ పోలీస్‌ స్టోరి '(204),' ది మిత్‌ '(2005)', రాబ్‌ బి హుడ్‌ '(2006) ఘన విజయం సాధించాయి. ఆయన చిత్రాల విజయ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆ చిత్రాలు అభిమాను లను అపారంగా ఆకట్టు కుంటూనే ఉన్నాయి. జాకీ చాన్‌ 100వ సినిమా '1911' భారత్‌లో విడుదలైంది.

    ప్రస్తుతం జాకీ ఏం చేస్తున్నారంటే...

    ప్రస్తుతం జాకీ ఏం చేస్తున్నారంటే...

    ప్రస్తుతం ఇండియా, చైనా సంయుక్త నిర్మాణంలో 'కుంగ్‌ ఫూ యోగ' అనే చిత్రాన్ని జాకీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయనతో పాటు భారతీయ తారలు సోనూ సూద్‌, అమీరా దస్తూర్‌ కూడా ప్రధాన పాత్రధారులు. గత ఏడాది చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటించినప్పుడు భారత్, చైనా మధ్య జరిగిన మూడు సినిమాల ఒప్పందంలో భాగంగా 'కుంగ్‌ ఫూ యోగ' తయారవుతోంది. యాక్షన్-అడ్వంచర్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే వచ్చే సంవత్సరం లో విడుదల కానుంది.

    English summary
    After his decades-long career in the film industry, Jackie Chan finally got his hands on an Oscar. Chan, 62, was awarded an honorary Oscar at the Eighth Annual Governors Awards at the Hollywood and Highland Center in Los Angeles on Saturday night. Tom Hanks, Michelle Yeoh and Chris Tucker presented Chan with the award in the final presentation of the evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X