జాకీ చాన్ కూతురు సంచలనం: స్వలింగ సంపర్క వివాహం, మ్యారేజ్ సర్టిఫికెట్ ఫోటోస్ రిలీజ్

Recommended Video

Jackie Chan's Daughter Confirms Her Marriage To Canadian Girlfriend

హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్‌జి మరో సంచలనానికి తెరలేపారు. స్వలింగ సంపర్కురాలైన 19 ఏళ్ల ఎట్టా ఎన్‌జి కొంతకాలంగా తన కెనడియన్ గర్ల్ ఫ్రెండ్ 31 సంవత్సరాల ఆండీ ఆటమ్‌తో కలిసి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

తమకు వివాహం అయిన విషయాన్ని వెల్లడిస్తూ ఎట్టా, ఆండీ దంపతులు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేశారు. డిసెంబర్ 8న తమకు పెళ్లయిన విషయాన్ని వెల్లడిస్తూ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపడం గమనార్హం.

కెనడాలో వివాహం

కెనడాలో వివాహం

ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ జంట తమ పెళ్లిని కెనడాలో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఎట్టా సొంత దేశమైన హాంకాంగ్‌లో ఉన్నారు. జాకీ చాన్ కూతురు వివాహం ప్రపంచ మీడియాలో ఇపుడు హాట్ టాపిక్ అయింది.

2017 నుంచి డేటింగ్

2017 నుంచి డేటింగ్

2017 నుంచి ఎట్టా ఎన్‌జి, ఆండీ ఆటమ్ మధ్య డేటింగ్ మొదలైంది. తర్వాత ఎట్టా కెనడాకు మూవ్ అయ్యారు. గతేడాది ఏప్రిల్‌లో వీరు... తల్లిదండ్రులు తమను ఇంట్లో నుంచి గెంటేయడంతో రోడ్డున పడ్డామని వెల్లడిస్తూ సహాయం కోరుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

తల్లిదండ్రులపై ఎట్టా ఆరోపణలు

తల్లిదండ్రులపై ఎట్టా ఆరోపణలు

నా తల్లిదండ్రులు ‘హోమోఫోపిక్ పేరెంట్స్' (స్వలింగ సంప్కకులను అసహ్యించుకునే వారు). అందుకే వారు ఆండీతో నా రిలేషన్ అంగీకరించడం లేదు. ఆశ్రయం లేక పోవడం వల్ల మేము బ్రిడ్జి కిందే పడుకుంటున్నాం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మేము పోలీసులను ఆశ్రయించాం, ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించాం, ఎల్‌జిటిక్యూ కమ్యూనిటీ షెల్టర్లను ఆశ్రయించాం... ఎవరూ మాకు సహాయం చేయడం లేదు అని అప్పట్లో ఎట్టా పోస్టు చేసిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

జాకీ చాన్- ఎలైన్ ఎన్‌జి సంతానం

జాకీ చాన్- ఎలైన్ ఎన్‌జి సంతానం

జాకీ చాన్- మాజీ బ్యూటీ క్వీన్ ఎలైన్ ఎన్‌జి సంతానమే ఎట్టా ఎన్‌‌జి. ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నపుడు ఎట్టా జన్మిచారు. అయితే వీరిద్దరూ తమ కూతురు స్విలింగ సంపర్కురాలిగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X