Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రోడ్డున పడ్డ జాకీ చాన్ కూతురు... వీధుల్లో, బ్రిడ్జి కింద జీవిస్తున్న వైనం!
Recommended Video
జాకీ చాన్ పేరు వినగానే మనకు హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయల సంపాదిస్తుంటారు. మరి అలాంటి వరల్డ్ ఫేమస్ స్టార్ కుటుంబం, పిల్లలు ఏస్థాయిలో ఉంటారు అంటే.... ఉన్నతమైన స్థానంలో, విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఉంటారని అంతా అనుకుంటారు. కానీ తాజాగా జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్ విడుదల చేసిన వీడియో చూస్తే మీ మనసు చలించక మానదు. దయనీయమైన స్థితిలో హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జికింద ఆమె జీవిస్తోంది. తన పరిస్థితి వెల్లడిస్తూ ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తన గర్ల్‌ఫ్రెండుతో కలిసి వీధుల్లో...
జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్ ఉండటానికి ఇల్లు కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆమె హాంకాంగ్ వీధుల్లో జీవితం కొనసాగిస్తోంది. తన గర్ల్‌ఫ్రెండ్ ఆండీతో కలిసి ఓ బ్రిడ్జి కింద జీవిస్తున్నట్లు ఎట్టా ఎన్ వెల్లడించారు. ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే. తాను ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం తన తల్లిదండ్రులే అని ఎట్టా ఎన్ ఆరోపించారు.
నేను స్విలింగ సంపర్కురాలిని, అందుకే...
నా తల్లిదండ్రులకు ‘హోమోఫోపిక్ పేరెంట్స్' (స్వలింగ సంప్కకులను అసహ్యించుకునే వారు). అందుకే వారు ఆండీతో నా రిలేషన్ అంగీకరించడం లేదు. అందుకే మేము నెల రోజులుగా ఆశ్రయం లేని స్థితిలో ఉన్నాము అని ఇట్టా తెలిపారు.
బ్రిడ్జికిందే పడుకుంటున్నాం
ఆశ్రయం లేక పోవడం వల్ల మేము బ్రిడ్జి కిందే పడుకుంటున్నాం. ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మేము పోలీసులను ఆశ్రయించాం, ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించాం, ఎల్జిటిక్యూ కమ్యూనిటీ షెల్టర్లను ఆశ్రయించాం... ఎవరూ మాకు సహాయం చేయడం లేదు అని ఎట్టా ఎన్ తెలిపారు.
జాకీ ఛాన్, ఎలెన్ ఎన్ సంతానం
జాకీ చాన్- మాజీ బ్యూటీ క్వీన్ ఎలైన్ ఎన్ సంతానమే ఎట్టా ఎన్. ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నపుడు ఎట్టా ఎన్ జన్మిచారు. అయితే వీరిద్దరూ తమ కూతురు స్విలింగ సంపర్కురాలిగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ కూతురు విషయంపై స్పందించడానికి వారు ఇష్ట పడటం లేదు.