తండ్రి వల్లే చెడిపోయి జైలుకు: జాకీ చాన్ కొడుకు
బీజింగ్: జాకీ చాన్ కొడుకు జాయ్ సీ చాన్‌కు చైనాలో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అతనికి ఈ శిక్షతో పాటు 326 డాలర్ల జరిమానా విధించింది. తన స్నేమితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి డ్రగ్స్ సేవిస్తూ గతేడాది ఆగస్టులో జాయ్ సీ చాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణ అనంతరం అతనికి బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు ఆరు నెలల శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
అయితే జైల్లో ఉన్న జాయ్ సీ చాన్ తండ్రిపై సంచలన ఆరోపణలు చేసాడు. తన తండ్రి వ్యవహార శైలి వల్లనే తాను ఇలా తప్పుడు మార్గం పట్టి జైలు కెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. తన తండ్రి సినిమాల్లో బిజీగా ఉంటూ అసలు తనను పట్టించుకునే వాడే కాదని, సెలబ్రిటీ కుటుంబంలో జన్మించడం వల్ల ఎంతో విలాసవంతమైన జీవితం గడిపానని, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక పోవడమే తన ఈ పరిస్థితి కారణమని ఆరోపించాడు.

డ్రగ్స్ కేసులో అరెస్టయినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పకొచ్చారు. మరో వైపు అరెస్టయి ఐదు రోజులైనా తనను చూడటానికి తల్లిదండ్రులు రాక పోవడంపై జాయ్ సీ చాన్ తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నాడు. ఇటీవలే తల్లి వచ్చి కలవడంతో భావేద్వానికి గురై కంటతడి పెట్టుకున్నాడు.
తల్లిదండ్రులు సంపాదించేదే పిల్లల కోసం....సంపాదన ధ్యాసలో పడి పిల్లలను పట్టించుకోకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో జాయ్ సీ చాన్ ఉదంతమే నిదర్శనం. ఈ సంఘటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.


Click it and Unblock the Notifications











