యాక్షన్ స్టార్ జాకీ చాన్ కొడుకుకు జైలు శిక్ష
హైదరాబాద్: హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ గురించి తెలియని వారు ఇండియాలో దాదాపుగా ఉండరేమో. తాజాగా జాకీ చాన్ కొడుకు జాయ్ సీ చాన్‌కు చైనాలో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ కేసులో అతనికి ఈ శిక్షతో పాటు 326 డాలర్ల జరిమానా విధించింది.

తన స్నేమితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి డ్రగ్స్ సేవిస్తూ గతేడాది ఆగస్టులో జాయ్ సీ చాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణ అనంతరం అతనికి బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు ఆరు నెలల శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.


Click it and Unblock the Notifications











